సైరా కోసం చివరిసారిగా అమితాబ్

Published : Mar 07, 2019, 03:08 PM IST
సైరా కోసం చివరిసారిగా అమితాబ్

సారాంశం

ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి సైరా షూటింగ్ చివరిదశలోకి వస్తోంది. షూటింగ్ ఎండింగ్ కు వచ్చినప్పటికీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అగస్ట్ లో సినిమాను రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ సాహో నిర్మాతలు క్లాష్ అవుతుందని చరణ్ తో మాట్లాడి సినిమాని మరో తేదికి వాయిదా వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

ఇక సినిమా షూటింగ్ కి సంబందించిన విషయానికి వస్తే.. హైదరాబాద్ లో వేసిన ఒక స్పెషల్ సెట్ లో షెడ్యూల్ ని చిత్ర యూనిట్ ఈ నెల 13న స్టార్ట్ చేయనుంది. 16వ తేదీ వరకు జరగబోయే ఈ షూటింగ్ లో బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ పాల్గొననున్నారు. గోసాయి వెంకన్నగా సినిమాలో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. 

అయితే సినిమా షూటింగ్ లో ఇదివరకే ఒక షెడ్యూల్ లో పాల్గొన్న అమితాబ్ ఇక ఇప్పుడు ఆఖరిసారిగా తన డేట్స్ ను ఉపయోగించుకుంటున్నారు. ఈ షెడ్యూల్ ముగియగానే అమితాబ్ చిత్ర యూనిట్ కి గుడ్ బాయ్ చెప్పేస్తారు. ఇక మళ్ళీ కుదిరితే సినిమా వేడుకల్లో కనిపిస్తారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ లో 250కోట్లకు పైగా ఖర్చు చేసి రూపొందిస్తున్నారు.    

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా