భర్త కూడా తప్పు చేస్తాడు.. ఉపాసన కామెంట్స్!

Published : Mar 07, 2019, 02:08 PM IST
భర్త కూడా తప్పు చేస్తాడు.. ఉపాసన కామెంట్స్!

సారాంశం

ఉమెన్స్ డే సందర్భంగా ప్రముఖ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

ఉమెన్స్ డే సందర్భంగా ప్రముఖ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ పక్కన బిజినెస్ లో తన సత్తా చాటుతూ మరోపక్క తన భర్తకి తగ్గ భార్య అనిపించుకుంటూ ముందుకు సాగుతోన్న ఉపాసనపై సొసైటీ కొంత గౌరవం ఉంది.

ప్రతి సక్సెస్ ఫుల్ మెన్ వెనుక ఉమెన్ ఉంటుందనే దానిపై మీరేమంటారని ఉపాసనని ప్రశ్నించగా.. దానికి సరైన ఉదాహరణ తన అమ్మమ్మ అని చెప్పింది. ఆమె దృఢమైన మహిళ అని, ఆమె వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పింది.

భర్తని విజయవంతంగా ముందుకు నడిపించడం భార్య బాధ్యత అని ఉపాసన చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు భర్త తప్పులు చేస్తారని ఆ సమయంలో భార్యలు బౌండరీలోనే ఉండిపోకుండా రూల్స్ బ్రేక్ చేసి బయటకి వచ్చి వాటిని సరిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు. మన భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని, మన సమాజంలో మహిళకు ఎంతో గౌరవం ఉందని ఉపాసన వెల్లడించింది.

మహిళల విషయంలో సమాజంలో ఏమైనా మార్పులు రావాల్సిన అవసరం ఉందా..? అని ప్రశ్నించగా.. అలాంటి అవసరం లేదనేది తన భావన అని చెబుతూ..  ప్రస్తుతం మహిళలు తమకు కావాల్సింది సాధించుకునే సానుకూల పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని చెప్పుకొచ్చింది.    

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా