మోహన్ బాబు చిత్రానికి అమితాబ్ ప్రమోషన్!

Published : Jun 15, 2021, 01:48 PM ISTUpdated : Jun 15, 2021, 02:59 PM IST
మోహన్ బాబు చిత్రానికి అమితాబ్ ప్రమోషన్!

సారాంశం

మోహన్ బాబు చాలా గ్యాప్ తరువాత ప్రధాన పాత్రలో సన్ ఆఫ్ ఇండియా తెరకెక్కుతుంది. ఈ చిత్రం నుండి 'జయ జయ మహాదేవర' అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు.

విలక్షణ నటుడు మోహన్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సన్ ఆఫ్ ఇండియా. పేట్రియాటిక్ కాన్సెప్ట్ తో సెటైరికల్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతుందని సమాచారం. మోహన్ బాబు చాలా గ్యాప్ తరువాత ప్రధాన పాత్రలో సన్ ఆఫ్ ఇండియా తెరకెక్కుతుంది. ఈ చిత్రం నుండి 'జయ జయ మహాదేవర' అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. 


ఈ పాటను లెజెండరీ యాక్టర్ అమితాబ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడంతో పాటు మోహన్ బాబు, ఇళయరాజాపై ప్రశంసలు కురిపించారు. ఇద్దరు గ్రేట్ పీపుల్ కాంబినేషన్ లో సాంగ్ రూపొందింది అంటూ ఆయన వీడియో విడుదల చేశారు. అమితాబ్ లాంటి నటుడు ప్రమోట్ చేయడం ద్వారా సన్ ఆఫ్ ఇండియా సినిమాకు మంచి ప్రచారం దక్కినట్లు అయ్యింది. 


రామ కీర్తిని తెలిపేలా ఉన్న ఈ సాంగ్ అద్భుతంగా ఉంది. అద్భుతమైన లిరిక్స్ కి ఇళయరాజా మ్యాజికల్ ట్యూన్స్ వినసొంపుగా మార్చాయి. సన్ ఆఫ్ ఇండియా చిత్రం ద్వారా మోహన్ బాబు తన మ్యాజిక్ రిపీట్ చేస్తారని అందరూ  భావిస్తున్నారు. ఇక సన్ ఆఫ్ ఇండియా చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్ ఇతర కీలక రోల్స్ చేస్తున్నారు.
 

సన్ ఆఫ్ ఇండియా చిత్రంలోని పాటను విడుదల చేసిన అమితాబ్ కి మోహన్ బాబు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అమితాబ్ ని ప్రపంచంలోనే మేటి నటుడిగా కొనియాడారు. అమితాబ్ నుండి తాను ఎంతో నేర్చుకున్నట్లు మోహన్ బాబు తన ట్వీట్ లో పొందుపరిచారు. 

PREV
click me!

Recommended Stories

Harikrishna: ఆ శక్తి ఉంటే తప్పకుండా నందమూరి హరికృష్ణని బతికిస్తా.. ఎలాగో చెబుతూ కీరవాణి ఎమోషనల్ కామెంట్స్
Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌