అరుదైన స్నేహితుడు,  సన్నిహితుడికి బెస్ట్ విషెస్

Published : Jun 15, 2021, 10:25 AM ISTUpdated : Jun 15, 2021, 10:26 AM IST
అరుదైన స్నేహితుడు,  సన్నిహితుడికి బెస్ట్ విషెస్

సారాంశం

చిత్ర ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొరటాల శివకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. సామాజిక అంశాలతో కూడిన కమర్షియల్ చిత్రాలు అందించిన స్టార్ డైరెక్టర్ మరిన్ని అద్భుత చిత్రాలు అందించాలని కోరుకుంటున్నారు.

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ జన్మదినం నేడు. చిత్ర ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొరటాల శివకు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. సామాజిక అంశాలతో కూడిన కమర్షియల్ చిత్రాలు అందించిన స్టార్ డైరెక్టర్ మరిన్ని అద్భుత చిత్రాలు అందించాలని కోరుకుంటున్నారు. కాగా కొరటాల శివకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో బర్త్ డే విషెస్ తెలియజేశారు. 


'స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు' అంటూ కొరటాల శివపై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఎన్టీఆర్ తన 30వ చిత్రం కొరటాల శివతో చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా జరిగింది. 

ఈ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లో భారీగా విడుదల చేయనున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేదిగా ఉంటుందని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో ఎన్టీఆర్-కొరటాల శివ జనతా గ్యారేజ్ మూవీ చేశారు. ఎన్టీఆర్ ఖాతాలో మరో సూపర్ హిట్ గా నిలిచింది జనతా గ్యారేజ్. 

PREV
click me!

Recommended Stories

Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?
అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?