Allu Arjun:అమితాబ్ నోట అల్లు అర్జున్ ‘పుష్ప’ డైలాగ్

Surya Prakash   | Asianet News
Published : Apr 25, 2022, 10:22 AM IST
Allu Arjun:అమితాబ్ నోట అల్లు అర్జున్  ‘పుష్ప’ డైలాగ్

సారాంశం

సినిమా హిట్ట‌వ‌డం ఒకెత్త‌యితే.. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేన‌రిజ‌మ్స్, డైలాగులు, ఇంకా పాట‌లు ఉత్త‌రాదిన మారు మూల ప్రాంతాల్లోకి వెళ్లిపోవ‌డం.. సెల‌బ్రెటీల నుంచి సామాన్యుల దాకా పుష్ప మేనియాతో ఊగిపోవటం జరిగింది.


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘పుష్ప’. ఈ  సినిమాను రెండు భాగాలుగా రూపొందించటానికి ప్లాన్ చేయగా..  తొలి భాగం ‘పుష్ప ది రైజ్’ గత ఏడాది డిసెంబ‌ర్ 17న విడుద‌లై సూపర్ హిట్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. అందులో అల్లు అర్జున్ మేన‌రిజం, యాక్ష‌న్ సీన్స్‌, ఎలివేష‌న్స్ సీన్స్‌, డైలాగ్స్ అన్నీ ప్రేక్ష‌కుల‌కు ఓ రేంజ్‌లో ఎక్కేశాయి. చాలా మంది ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులే కాదండోయ్ సినీ సెల‌బ్రిటీలు స‌హా క్రికెట‌ర్స్‌ సైతం పుష్ప పాట‌ల‌కు స్టెప్పులేశారు, డైలాగ్స్ చెబుతూ రీల్ వీడియోలు చేశారు. దీంతో పుష్ప కిక్ అంద‌రికీ ఎక్కేసింది. ఇప్పుడు పుష్ప డైలాగుని అమితాబ్ సైతం చెప్పి ఆశ్చర్యపరిచారు.
 

ఇక అమితాబ్ ఈ డైలాగు చెప్పడాన్ని బట్టే అర్దం చేసుకోవచ్చు   పుష్ప హిందీలో ఏ స్దాయిలో  సంచ‌ల‌నం సృష్టించిందో. దాదాపు వంద కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా    ధాటికి 83 లాంటి పెద్ద హిందీ సినిమా దెబ్బ తిన‌డం ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. సినిమా హిట్ట‌వ‌డం ఒకెత్త‌యితే.. ఈ సినిమాలో అల్లు అర్జున్ మేన‌రిజ‌మ్స్, డైలాగులు, ఇంకా పాట‌లు ఉత్త‌రాదిన మారు మూల ప్రాంతాల్లోకి వెళ్లిపోవ‌డం.. సెల‌బ్రెటీల నుంచి సామాన్యుల దాకా పుష్ప మేనియాతో ఊగిపోవటం జరిగింది.

ఇప్పుడు ఈ ఫీవ‌ర్ బాలీవుడ్ సూప‌ర్ స్టార్..బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా నిర్వ‌హిస్తోన్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రోగ్రామ్‌ను కూడా ట‌చ్ చేసింది. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటిరా..ఫైర్’ అంటూ హిందీ అమితాబ్ డైలాగ్ చెప్పడమే కాదండోయ్.. పుష్ప సినిమాలో ఆడియెన్స్ క్వ‌శ్చ‌న్‌లో పుష్ప సినిమాకు సంబంధించిన ప్ర‌శ్న కూడా వేశారు. ఎర్ర చంద‌నం చెట్లు ఏ ప్రాంతానికి చెందిన‌వి ఎ.ప‌శ్చిమ క‌నుమ‌లు, బి.సుంద‌ర్ బ‌న్స్‌, సి.తూర్పు క‌నుమ‌లు, డి.దోబా అనే ఆప్ష‌న్స్ ఇచ్చారు.
 
అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి స్టార్ పుష్ప డైలాగ్‌ను చెప్ప‌డంతో అది వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోను ఓ ఫ్యాన్ షేర్ చేయ‌గా, దేవిశ్రీ ప్ర‌సాద్ లైక్ చేయ‌డం విశేషం. ‘పుష్ప ది రూల్’ సినిమా షూటింగ్‌ను జూలై త‌ర్వాత స్టార్ట్ చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.

అమితాబ్ , అయితే, ‘పుష్ప ది రూల్’ ఇంకా సెట్స్ మీదకే వెళ్ళలేదు. మారుతున్న బాక్సాఫీస్ సమీకరణాల నేపథ్యంలో దర్శకుడు సుకుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మేకర్స్, హీరో అల్లు అర్జున్.. అన్ని ఈక్వేషన్స్‌నీ పరిగణనలోకి తీసుకుని ‘పుష్ప ది రూల్’ తెరకెక్కించాల్సి వుంది. మరో ప్రక్క హిందీ మార్కెట్ మాత్రమే కాదు, తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల్ని సైతం ‘పుష్ప ది రూల్’ టార్గెట్ చేయాల్సి వుంది. ‘పుష్ప’ సినిమాకి హీరోయిన్ రష్మిక మండన్న అదనపు అడ్వాంటేజ్. ఆమె కూడా ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode:అత్తను ఒప్పించిన దీప-సారీ చెప్పిన శౌర్య-కావేరికి దొరికిపోయిన శ్రీధర్
OTT లో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలు వెబ్ సిరీసులు, సస్పెన్స్,థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి పండగే..