రోజుకు 14 గంటలు పనిచేస్తున్న అమితాబ్ బచ్చన్, స్వయంగా వెల్లడించిన బిగ్ బీ

By Mahesh JujjuriFirst Published Sep 8, 2022, 10:51 AM IST
Highlights

ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు.. హీరోయిన్లు రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు షూటింగ్ లో పనిచేయాడానికి భయపడుతున్నారు.. అలసిపోతున్నారు. కాని 80 ఏళ్ల వయస్సులో కూడా రోజుకు 14గంటలు కష్టపడుతున్నారు బిగ్ బి అమితాబ్ బచ్చన్. 

ఒకప్పుడు బాలీవుడ్ లో అమితాబ్ కాని.. టాలీవుడ్ లో ఎన్టీఆర్. ఏఎన్నార్, తమిళ్ లో ఎమ్జీఆర్ లాంటి  స్టార్స్ రోజుకు రెండు మూడు సినిమాలకు పైనే పనిచేసేవారు.. రాత్రీ పగలు కష్టపడి షూటింగ్స్ కంప్లీట్ చేసేవారు.. ఏడాదికి పది సినిమాలకు పైనే రిలీజ్ చేసిన హీరోలు ఉన్నారు. కాని ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలు అనిపించుకునేవారు.. ఏడాదికి ఒక్క సినిమా చేస్తే గొప్ప విషయం. కొంత మంది మాత్రమే ఏడాదికి రెండు... లేదా మూడు సినిమాల వరకూ మాత్రమే  చేస్తున్నారు. రోజులో ఎనిమింది గంటలు కష్టపడితే ఎక్కువే. 
 
ఇక ఈకాలంలో అది కూడా 80 ఏళ్ల వయస్సులో కూడా..  రోజుకు 14 గంటలు కష్టపడుతున్నాడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్. అందుకే ఆయన ఇండియన్ మెగాస్టార్ అయ్యాడు. ఆరోగ్యం సహకరించకపోయినా.. పనినే ప్రాణంగా భావిస్తారు బిగ్ బీ. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తాను సుదీర్ఘ సమయం పాటు పనిచేస్తున్నట్టు అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. మోస్ట్ పాపులర్ బాలీవుడ్ షో.. కౌన్ బనేగా కరోడ్ పతి టీవీ షో గురించి ఆయన మాట్లాడారు. అమితాబ్ బచ్చన్ ఇటీవల రెండోసారి కరోనా బారిన పడ్డారు అయినా సరే ఆయన నిరంతరం కష్టించి..పనిచేస్తూనే ఉన్నాడు. 

ప్రస్తుతం కేబీసీ 14  సీజన్ నడుస్తోంది. ఎంతో ఉత్కంఠగా సాగుతున్న ఈ షో  తాజా ఎపిసోడ్ లో పాల్గోన్న కంటెస్టెంట్ బ్రిజ్ కిషోర్... తన ఊపిరి సలపని ఉద్యోగ జీవితం గురించి ప్రస్తావించారు. ఈ  సందర్భంలో.. అమితాబ్ కూడా తన షూటింగ్ టైమింగ్.. డేటూ డే తన టైమ్ టేబుల్ గురించి వివరించారు.  ఉదయం 6 గంటలకు లేచింది మొదలు రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నట్టు అమితాబ్ చెప్పారు.రోజుకు 14 గంటల వరకూ పనిచేస్తున్నట్టు.. అది తనకు ఇంకా బలం ఇస్తుదంటున్నారు అమితాబ్. 

అంతే కాదు  మన ఇద్దరిదీ ఒకటే స్థితి అంటూ పోల్చి కంటెస్టెంట్ తో పోల్చి  చెప్పారు బిగ్ బీ.  అంతే కాదు గేమ్ ముగిసిన తర్వాత తిరిగొచ్చి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నట్టు అమితాబ్ తెలిపారు. కరోనా కారణంగా అమితాబ్ రీసెంట్ గా  చిన్న బ్రేక్ తీసుకున్నారు... ఐసోలేట్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్నాక తాను రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నానన్నారు. అంతే కాదు తాను కరోనాతో పోరాటు చేస్తున్న టైమ్ లో  తన కోసం ప్రార్థించిన వారందరికీ అమితాబ్ కేబీసీ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు.

click me!