Amitabh Remuneration: ఆ సినిమాకోసం రెమ్యూనరేషన్ తగ్గించుకున్న అమితాబ్, ఎందుకంటే...?

Published : Mar 02, 2022, 12:03 PM IST
Amitabh Remuneration: ఆ సినిమాకోసం రెమ్యూనరేషన్ తగ్గించుకున్న అమితాబ్, ఎందుకంటే...?

సారాంశం

అమితాబ్ (Amitabh Bachchan) మంచి మనసును చాటుకున్నారు. తను నటిస్తన్న సినిమా ఆర్దిక పరిస్తితిని దృష్టిలో పెట్టుకుని తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్నారు. సినిమా రిలీజ్ అవ్వడం తనకు ముఖ్యం అన్నారు.

అమితాబ్ (Amitabh Bachchan) మంచి మనసును చాటుకున్నారు. తను నటిస్తన్న సినిమా ఆర్దిక పరిస్తితిని దృష్టిలో పెట్టుకుని తన రెమ్యూనరేషన్ ను తగ్గించుకున్నారు. సినిమా రిలీజ్ అవ్వడం తనకు ముఖ్యం అన్నారు.

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబచ్చన్(Amitabh Bachchan)  ఫుట్ బాల్ కోచ్ గా నటించిన సినిమా  జుండ్. బిగ్ బీ ప్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈమూవీ నుంచి కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్  రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ సాధిచింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అమితాబ్(Amitabh Bachchan) బచ్చన్ తన పారితోషికాన్ని తగ్గించుకుని పెద్ద మనసు చూపారు. ఈ విషయాన్ని స్వయంగా ఈమూవీ ప్రొడ్యూసర్ సందీప్ సింగ్ వెల్లడించారు.

జుండ్ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే డబ్బుల విషయంలో టైట్ అయ్యి నిర్మాతలు బడ్జెట్ కు సంబంధించి ఇబ్బంది పడుతున్నట్టు అమితాబ్ (Amitabh Bachchan) తెలుసుకున్నారు. దీంతో తన  రెమ్యూనరేషన్ ను తగ్గించుకోవడం కోసం ఆయన రెడీ అయ్యారు. బిగ్ బీ కి ఫుట్ బాల్  అంటే చాలా ఇష్టం. తనకు ఇష్టమైన ఆటకు సంబంధించిన సినిమాలో నటించడం.. ఆసినిమా కష్టంలో ఉండటంతో అమితాబ్ సహాయం చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. అమితాబ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను ఎంతో ఇష్టపడినట్టు సందీప్ సింగ్ తెలిపారు. నచ్చిన సినిమా కావడంతో నిర్మాతల కష్టాలను గుర్తించిన అమితాబ్ ఆ ఆఫర్ ఇచ్చారు. 

అమితాబ్ (Amitabh Bachchan)తన రెమ్యూనరేషన్ లోంచి తగ్గించిన అమౌంట్ తో పాటు తనపై ఖర్చు చేసే డబ్బులకు బదులు దానిని సినిమా నిర్మాణంపై ఖర్చు చేయమని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా  అమితాబ్ అన్నట్టు సందీప్ సింగ్ తెలిపారు. అంతే కాదు ఈ విషయంలో అమితాబ్ సిబ్బంది కూడా ఆయన్ను ఫాలో అవుతున్నట్టు సమాచారం.

 అమితాబ్ సిబ్బంది కూడా తమకు తక్కువ మొత్తం చెల్లిస్తే చాలని చెప్పడంతో నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. టీ సిరీస్ సంస్థ జుండ్ నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు అంగీకరించడంతో మొత్తానికి ఈ సినిమా కష్టాలకు చెక్ పడింది. జుండ్ సినిమాను  నెల 4న రిలీజ్ చేయాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్