తల్లిపై నెటిజన్ సెటైర్‌..దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన అమితాబ్‌ మనవరాలు

Published : Feb 17, 2021, 07:46 PM IST
తల్లిపై నెటిజన్ సెటైర్‌..దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన అమితాబ్‌ మనవరాలు

సారాంశం

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలీ నందా ఓ నెటిజన్‌కి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. వాళ్లమ్మని చులకన చేసి మాట్లాడిన వ్యక్తికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. నవ్య నవేలీ రిప్లైకి ఆ వ్యక్తికి మతిపోయిందని చెప్పొచ్చు. ఇటీవల నవ్య నవేలీ ఓ కార్యక్రమంలో జెండర్‌ ఈక్వాలిటీపై సందేశం ఇచ్చింది. 

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు నవ్య నవేలీ నందా ఓ నెటిజన్‌కి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. వాళ్లమ్మని చులకన చేసి మాట్లాడిన వ్యక్తికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. నవ్య నవేలీ రిప్లైకి ఆ వ్యక్తికి మతిపోయిందని చెప్పొచ్చు. ఇటీవల నవ్య నవేలీ ఓ కార్యక్రమంలో జెండర్‌ ఈక్వాలిటీపై సందేశం ఇచ్చింది. చాలా రోజులుగా ఆమె సామాజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంది. న్యూయార్క్ లోని ఫోర్డామ్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన నవ్య ప్రస్తుతం `ఆరా హెల్త్` పేరుతో ఆన్‌లైన్‌ హెల్త్ కేర్‌ పోర్టల్‌ని ప్రారంభించింది. 

ఇంత వరకు బాగానే ఉంది. ఇటీవల నవ్య చెబుతూ, తన కుటుంబంలో మహిళలందరు ఏదో ఒక పనిచేస్తున్నారని తెలిపింది. దీనిపై నెటిజన్ స్పందిస్తూ, మీ అమ్మకి ఉద్యోగం లాంటివేమీ లేదుగా ` అంటూ సెటైరికల్‌గా ప్రశ్నించాడు. దీంతో నవ్యకి మండిపోయింది. వెంటనే దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది. `ఆమె ఒక రైటర్‌, డిజైనర్‌, హౌజ్‌ వైఫ్‌, మాకు తల్లి` అని చెప్పింది. అంతటితో ఆగలేదు. మరో పెద్ద పోస్ట్ ని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పంచుకుంది. 

`తల్లిగా, భార్యగా ఉండటం ఫుల్‌టైమ్‌ జాబ్‌ లాంటిదే. ఇంటి పనులను భుజాన వేసుకునే మహిళలను చులకనగా చూడకండి. ఒక తరాన్ని పెంచడంలో వాళ్ల పాత్ర కీలకమైనది. అలాంటి వారికి సపోర్ట్ గా నిలబడండి తప్ప ఇలా అవమానించకండి. చులకన చేసి మాట్లాడకండి` అని కౌంటర్‌ ఇచ్చింది. దీంతో ఆ నెటిజన్‌కి మతిపోయింది. అమితాబ్‌ కూతురు శ్వేత, నిఖిల్‌ల కుమార్తె నవ్య నవేలీ నందా అన్న విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది