
జబర్ధస్త్ కామెడీ షోతో ఈ యాంకర్ ఎక్కడలేని క్రేజ్ సంపాదించుకుంది అనసూయ. అంతటితో ఆగకుండా వెండితెరపై కూడా ప్రత్యక్షమై సినీ ప్రేమికులను ఆకట్టుకుంటోందీ అందాల తార.ఓ వైపు తన అందంతో ఆకట్టుకుంటూనే మరో వైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ నటిస్తూ దుమ్ము రేపుతోంది. ఆ మధ్యన వచ్చిన క్షణం సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నెగిటివ్ షేడ్‌లో ఉన్న పాత్రలో ఆకట్టుకున్నా.. రంగస్థలంలో రంగమ్మత్త పాత్రలో నటనతో మ్యాజిక్ చేసినా అనసూయకే చెల్లింది.
తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటూ వరుస అవకాశాలు సొంతం చేసుకున్న అనుసూయకు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక తాజాగా అనసూయ మరో ఛాలెంజ్ రోల్‌లో నటించనున్నట్లు వార్తలు వచ్చి అభిమానులను ఆనందపరిచాయి.
గోపిచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది అనసూయ అన్నారు. అంతేకాదు ఈ సినిమాలో అనసూయ వేశ్య పాత్రలో కనిపించనుందని కూడా చెప్పేసారు. త్వరలోనే చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనుందని ఎదురుచూస్తున్న సమయంలో ఓ ట్విస్ట్ పడింది. ఈ వార్తలపై మారుతీ వెంటనే స్పందించాడు. అలాంటి పాత్ర ఏది కూడా అనసూయ తమ సినిమాలో చెయ్యడం లేదని క్లారిటీ ఇచ్చాడు. దాంతో అసలు ఈ వార్తను ఎవరు ప్రచారంలోకి తీసుకువచ్చారనే విషయమై మీడియాలో డిస్కషన్ మొదలైంది.
స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తున్న అనసూయ ప్రస్తుతం`థాంక్స్ యు బ్రదర్` లో గర్భవతిగా కనిపిస్తోంది. ఈ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇక కార్తికేయ నటిస్తున్న `చావు కబురు చల్లగా`లో ఒక ప్రత్యేక పాట చేస్తోంది. అంతే కాకుండా మాస్ రాజా రవితేజ నటిస్తున్న `ఖలాడీ`లోనూ కీలక పాత్రలో కనిపించబోతోంది.