Padamati Sandhyaragam: రామలక్ష్మిపై కోప్పడ్డ ఆధ్య.. భర్తని నిర్లక్ష్యం చేస్తున్న జానకమ్మ!

Published : Jun 10, 2023, 02:31 PM IST
Padamati Sandhyaragam: రామలక్ష్మిపై కోప్పడ్డ ఆధ్య.. భర్తని నిర్లక్ష్యం చేస్తున్న జానకమ్మ!

సారాంశం

Padamati Sandhyaragam: జీ తెలుగులో ప్రసారమవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. సాంప్రదాయానికి ఆధునికతకి ప్రతీకలైన ఇద్దరు అక్కచెల్లెళ్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 10 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

 ఎపిసోడ్ ప్రారంభంలో ట్రయల్ రూమ్ నుంచి బుర్కా వేసుకుని బయటికి వస్తాడు శీను. ఎవరో లేడీ అనుకొని నా చీర ఏది అని అడుగుతుంది చారు. లోపల ఉంది అని చెప్పి కంగారుపడి వెళ్ళిపోతాడు శీను. లోపల ఎవరు ఉన్నారు బయటికి రండి అని కోపంగా ఉంటుంది చారు. నెమ్మదిగా బయటికి వస్తుంది ఆధ్య ని చూసి అందరూ షాక్ అవుతారు.

నా చీర నువ్వెందుకు కట్టుకున్నావని కోపంగా అడుగుతుంది చారు. నువ్వు వద్దన్నావు కదా అందుకే కట్టుకున్నాను రామలక్ష్మి ట్రయల్ వేయమని చెప్పింది  అంటుంది ఆధ్య. సరే మన చీర మన దగ్గరే ఉంది కదా పదండి వెళ్దాం అంటుంది జానకి. చీర విప్పేసి చారు కిమ్మని చెప్తుంది పద్మ. అలాగే అంటూ చీర విప్పడానికి ట్రైల్  రూమ్ లోకి వెళుతుంది ఆధ్య.

మరోవైపు బట్టలు లేకుండానే ట్రైల్ రూమ్ లో ఉండిపోతాడు ప్రశాంత్. అదే సమయంలో మరో ట్రైలర్ రూమ్ లోకి వెళ్లి బుర్కా విప్పేసి పక్కకు తోసేసి బయటకు వచ్చేస్తాడు శీను. కరెక్ట్ గా ఆ బుర్కా ప్రశాంత్ రూమ్ లోకి వెళుతుంది. ఆ బుర్కా వేసుకొని బయటకు వచ్చేస్తాడు  ప్రశాంత్. బుర్కా లో ఉన్న వ్యక్తి ఆడ మనిషి అనుకొని తనతో సరదాగా మాట్లాడుతాడు వెంకటరావు కానీ కిందన షూ వేసుకోవటం చూసి దొంగ దొంగ అంటూ అతని వెంట పడతాడు.

ఆ తర్వాత తెచ్చిన బట్టలు అన్ని చూసుకుంటూ ఉంటారు రామలక్ష్మి వాళ్ళు. ముభావంగా ఉన్న తల్లిని ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది రామలక్ష్మి. మీ నాన్నగారి కోసం బట్టలు కొన్నాను కానీ ఆయనకి ఇవ్వటానికి భయంగా ఉంది అంటుంది జానకి. వదిన చేస్తే అసలు తీసుకోడు అంటూ వెటకారంగా మాట్లాడుతుంది పద్మ.

నువ్వు ఇస్తే కాదనరు రామలక్ష్మి నీ చేత్తోనే మీ నాన్నగారికి ఇవ్వు అంటుంది జానకి. ముందు భయపడుతుంది కానీ తండ్రి వచ్చేసరికి మీకోసం బట్టలు తీసుకొచ్చాను అని చెప్పి తండ్రికి బట్టలు ఇస్తుంది రామలక్ష్మి. బట్టలు భార్య తెచ్చింది అనుకోని సంకోచంతో ఆ బట్టలు తీసుకోడు కానీ రామలక్ష్మి నేనే తెచ్చాను అని చెప్పడంతో ఆ బట్టల్ని తీసుకుని వెళ్ళిపోతాడు రఘురాం.

 రఘురాం బట్టలు తీసుకున్నందుకు సంతోషిస్తారు జానకమ్మ వాళ్ళు. మరోవైపు దిగులుగా ఉన్న రామలక్ష్మిని చూసి ఈరోజు గేమ్ ఉంది కదా అంటుంది ఆధ్య. నాకు ఇష్టం లేదు అంటుంది రామలక్ష్మి. అదే విషయం నా కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పు అంటుంది ఆధ్య. అలా చెప్పలేకపోతుంది రామలక్ష్మి. ఇంట్లో వాళ్ల కోసం ఎందుకు నీ ఫ్యూచర్ ని పాడు చేసుకుంటున్నావు.

 ఈ ఇంట్లో వాళ్లకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో పనిలేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆధ్య. మరోవైపు ఇంకా చాలా నగలు చేయించుకోవాలి అని తల్లికి చెప్తుంది పద్మ. వచ్చిన వాళ్ళకి మర్యాదలు ఎలా చేయాలో చూడండి మిగిలినవన్నీ తరువాత అని మందలిస్తుంది పద్మ తల్లి. అప్పుడే అక్కడికి వచ్చిన రామలక్ష్మి ని చూసి ఎందుకు అలా ఉన్నావు,ఇంకా కాలేజీకి వెళ్లలేదా టైం అయింది కదా అని అడుగుతుంది జానకి.  

నాన్నగారు వెళ్ళొద్దన్నారు కదా అంటుంది రామలక్ష్మి. అయినా కోపంలో అలాగే అంటారు ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు అంటుంది  జానకమ్మ. వాడు వద్దంటే నువ్వు వెళ్ళమనటమేంటి అని కోప్పడుతుంది జానకమ్మ అత్తగారు. రామలక్ష్మి కూడా కాలేజీకి వెళ్లడానికి ఇష్టపడదు. ఎలాగూ శీను బావ పెళ్లి దగ్గర పడుతుంది కదా పిన్నికి సాయం చేస్తాను అని చెప్తుంది.

ఇంతలో ప్రమీల ఫోన్ చేసి నాకు ఆధ్యని చూడాలనిపిస్తుంది సాయంత్రం వస్తాను అలాగే ముఖ్యమైన విషయం కూడా మీతో మాట్లాడాలి  ప్రమీల. సరే మీ ఇష్టం అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది జానకమ్మ. జరిగిందంతా అత్తగారికి చెప్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా