అమీర్‌ ఖాన్‌కి కరోనా పాజిటివ్‌..టెస్ట్ కి వెళ్లిన కియారా అద్వానీ.. ఫలితం ఏంటి?

Published : Mar 24, 2021, 01:26 PM ISTUpdated : Mar 24, 2021, 01:28 PM IST
అమీర్‌ ఖాన్‌కి కరోనా పాజిటివ్‌..టెస్ట్ కి వెళ్లిన కియారా అద్వానీ.. ఫలితం ఏంటి?

సారాంశం

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఆయన కొద్దిగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా కోవిడ్‌ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌ అయ్యారు.

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌కి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఆయన కొద్దిగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా కోవిడ్‌ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌ అయ్యారు. రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ఇటీవల తనని కలిసి వారు కూడా టెస్ట్ చేయించుకోమని చెప్పారు. 

ఇదిలా ఉంటే కియారా అద్వానీ టెస్ట్ కి వెళ్తున్నారు. అమీర్‌ ఖాన్‌తో కలిసి ఇటీవల కియారా అద్వానీ ఓ కమర్షియల్‌ యాడ్‌ చేశారు. దీనికి నితేష్‌ తివారి డైరెక్షన్‌ చేశారు. ఈ సందర్బంగా వీరిద్దరు కలిశారు. దీంతో కియారా కూడా టెస్ట్ కి వెళ్లారు. ఆమె ఫలితం రావాల్సి ఉంది. అలాగే నితేష్‌ తివారి సైతం టెస్ట్ చేయించుకుంటున్నారు. దీంతో ఇప్పుడు బాలీవుడ్‌లో ఆందోళన నెలకొంది. అసలే వైరస్‌ విజృంభిస్తున్న వేళ టాప్‌ స్టార్ కి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తుంది.

ఇదిలా ఉంటే కియారా ఇప్పటికే ఓ సారి టెస్ట్ చేయించుకుంది. ఆమె నటిస్తున్న `భూల్‌ భులైయ్యా 2` చిత్ర హీరో కార్తిక్‌ అర్యాన్‌కి కరోనా సోకింది. దీంతో తనకు కూడా సోకిందేమో అని ఆమె టెస్ట్ చేయించుకోగా, నెగటివ్‌ అని తేలింది. ఇప్పుడు మరోసారి ఆమె టెస్ట్ కి వెళ్లడం విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు
2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?