కీర్తిసురేష్‌ ముఖంపై నితిన్‌ బాక్సింగ్‌ పంచ్‌.. పడిపోయి తిరిగి వాయించిన అను

Published : Mar 24, 2021, 12:39 PM ISTUpdated : Mar 24, 2021, 12:42 PM IST
కీర్తిసురేష్‌ ముఖంపై నితిన్‌ బాక్సింగ్‌ పంచ్‌.. పడిపోయి తిరిగి వాయించిన అను

సారాంశం

`రంగ్‌ దే` చిత్రంలో నితిన్‌, కీర్తి మధ్య వచ్చే సన్నివేశాలు ఫన్నీగా ఉన్నాయి. వీరిద్దరు తరచూ గొడవపడుతుంటారు. చివరికి కీర్తిని పెళ్లి కూడా బలవంతంగానే చేసుకుంటాడు నితిన్‌. రియల్‌ లైఫ్‌లో కూడా వీరిద్దరు అలానే గొడవపడుతుంటున్నారు.

నితిన్‌, కీర్తిసురేష్‌ జంటగా నటించిన `రంగ్‌ దే` చిత్ర ట్రైలర్‌ ఇటీవల విడుదలై సోషల్‌ మీడియాలో యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది. ఇందులో నితిన్‌, కీర్తి మధ్య వచ్చే సన్నివేశాలు ఫన్నీగా ఉన్నాయి. వీరిద్దరు తరచూ గొడవపడుతుంటారు. చివరికి కీర్తిని పెళ్లి కూడా బలవంతంగానే చేసుకుంటాడు నితిన్‌. రియల్‌ లైఫ్‌లో కూడా వీరిద్దరు అలానే గొడవపడుతుంటున్నారు. విదేశాల్లో షూటింగ్‌ సమయంలో కూడా కీర్తి, నితిన్‌, వెంకీ అట్లూరి గొడవ పడిన వీడియో ఒక వైరల్‌ అయ్యింది. 

తాజాగా మరోసారి నితిన్‌, కీర్తి గొడవపడటం ఇంట్రెస్టింగ్‌గా మారింది. సినిమా సెట్‌లో నితిన్‌..బాక్సింగ్‌ బ్లౌజ్‌లు తొడుక్కుని కీర్తిసురేష్‌ ముఖంపై పంచ్‌ వేస్తాడు. దీంతో ఆమె పడిపోతుంది. ఆమె వద్ద ఉన్న ఓ వస్తువుని లాక్కుంటాడు నితిన్‌. దీంతో కీర్తి కూడా నితిన్‌నికొడుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియోని కీర్తిసురేష్‌ పంచుకుంది. ఈ సందర్బంగా ఆమె చెబుతూ, కొన్ని సార్లు ఫేక్‌ పంచ్‌ కూడా నిజంగా మారిపోతే ఇలా ఉంటుంది` అని పోస్ట్ పెట్టింది. దీన్ని నితిన్‌ రిప్లై ఇస్తూ, నిజంగా కావాలని కొట్టలేదు అను` అని నితిన్‌ పేర్కొన్నాడు. ఇందులో నితిన్‌ అర్జున్‌గా, కీర్తి అను పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సరదా ఎపిసోడ్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. సినిమా విడుదలకు దగ్గరపడుతున్న నేపథ్యంలో వీడియో క్లిప్‌ మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇదిలా ఉంటే కీర్తి ప్రమోషన్‌లో పాల్గొనడం లేదని కీర్తిసురేష్‌ స్కూల్‌ డ్రెస్‌లో ఉన్న ఫోటోని షేర్‌ చేస్తూ మిస్సింగ్‌ అని పేర్కొనడం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సైతం ఫన్నీగా చర్చనీయాంశంగా మారింది. షూటింగ్‌లో వీరి మధ్య ఇలాంటివి ఇంకా చాలా ఫన్నీ ఎపిసోడ్స్ జరిగి ఉంటాయని చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో