హాలీవుడ్ లో విషాదం.. స్టార్ కమెడియన్ పాల్ రూబెన్స్ కన్నుమూత...

Published : Aug 01, 2023, 09:11 PM IST
హాలీవుడ్ లో విషాదం.. స్టార్ కమెడియన్ పాల్ రూబెన్స్ కన్నుమూత...

సారాంశం

ఈమధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదాలు ఎక్కువైపోయాయి. టాలీవుడ్,బాలీవుడ్,హాలీవుడ్ అన్న తేడా లేకుండా.. ఫిల్మ్ స్టార్స్ ఈలోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. తాజాగా హాలీవుడ్ హాస్యనటుడు రూబెన్స్ కన్నుమూశారు.   

హాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. అమెరికన్‌ ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తూ.. అలరించే  హాస్య నటుడు పాల్‌ రూబెన్స్‌ ఇక లేరు. అనారోగ్య కారణాల వల్ల ఆయన  మరణించాడు. ప్రస్తుతం రూబెన్స  వయస్సు 70 సంవత్సరాలు. గత కొంత కాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న పాల్‌ ఆదివారం అర్థరాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని హాలీవుడ్ ఆంగ్ల మీడియా పేర్కొంది. ఆయన మృతి పట్ల పలువురు హాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 

ఇక పాల్‌ 80వ దశకంలో పీ వీ హర్మన్‌ పాత్రతో విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ముఖ్యంగా హే హే హే అంటూ విచిత్రంగా నవ్వుతూ.. విలక్షణ నటనతో.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అన్నిరకాల ప్రేక్షకులకు కు హాట్‌ ఫేవరైట్‌ గా మారిపోయాడు పాల్. అయితే పాల్  తనకు క్యాన్సర్‌ ఉందన విషయాన్ని దాచిపెట్టారు.  ఎప్పుడు  ఎవరికీ వెల్లడించలేదు.  తనకు అత్యంత సన్నిహితులైన వారికి తప్పించి ఈ విషయం ఎవరికీ తెలియదు ఈ విషయాన్ని రూబెన్స్ బందువు ఒకరు మీడియాకు వెల్లడించారు. పాల్కు కాన్సర్ వచ్చి చాలా కాలం అయినట్టు వారు తెలిపారు. 

పాల్ రుబెన్స్ దాదాపు  ఆరు సంవత్సరాలుగా కాన్సర్ తో  పోరాడుతున్నారు. అయితే తనకు ఇలా క్యాన్సర్‌ మహామ్మారి సోకిందని ఎవరికీ  చెప్పనందకు తనను క్షమించమని, తన స్నేహితులు, అభిమానుల ప్రేమ వెలకట్టలేదని, అందరినీ తను చాలా ప్రేమిస్తున్నానని పాల్ చనిపోవడానికి కొద్ది రోజులు ముందు పబ్లిక్ నోట్ ఒకటి రాశారు. ఈ నోట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆయన అభిమానులను కంటతడి పెట్టిస్తుంది. తనకోసం ఎవరూ బాధపడకూడదు అని ఆయన ఇలా చేశారు. 

ఇక పాల్ 2001లో వచ్చిన బ్లో సినిమాలో డ్రగ్స్‌ డీలింగ్‌ హేయిర్‌ డ్రెస్సర్‌గా చేసిన రోల్‌కు గొప్ప ప్రశంసలు అందుకున్నాడు. చివరగా పాల్ పీ వీస్‌ బిగ్‌ హాలీడే సినిమాలో కనిపించాడు. ఈ సినిమాకు రైటర్‌, ప్రొడ్యూసర్‌ కూడా ఆయనే. టెలివిజన్‌ రంగంలోనూ పాల్ తనదైన ముద్ర వేసుకున్నాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Illu Illalu Pillalu Today Episode Dec 22: ధీరజ్ కంట పడిన విశ్వ, అమూల్య.. మరోపక్క వల్లి భయం