అత్యాచారం చేసి చంపేస్తారేమో అనుకున్నాః అమీషా పటేల్‌ సంచలన వ్యాఖ్యలు

By Aithagoni RajuFirst Published Oct 29, 2020, 8:56 AM IST
Highlights

ఘాటు అందాలతో మత్తెక్కించే హీరోయిన్‌ అమీషా పటేల్‌కి బీహార్‌ ఎన్నికల్లో దారుణమైన పరిస్థితులు ఎదురయ్యాయట. తనని అత్యాచారం చేస్తారనేంత పరిస్థితులు చోటు చేసుకున్నాయని అంటోంది అమీషా పటేల్‌. 

తెలుగులో మహేష్‌బాబు `నాని`, ఎన్టీఆర్‌ `నరసింహుడు`, `పరమవీరచక్ర` వంటి చిత్రాల్లో నటించిన ఈ హాట్‌ బాలీవుడ్‌ భామ ఇటీవల బీహార్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్‌ జన్‌శక్తి పార్టీ అభ్యర్థి ప్రకాష్‌ చంద్ర తరఫున బీహార్‌ లోని దౌద్‌ నగర్‌లోని ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంది అమీషా. ఈ సందర్భంగా తనకు చాలా భయంకరమైన పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేసింది అమీషా. 

`దౌద్‌నగర్‌లో ప్రకాష్‌ చంద్ర కోసం ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన నన్ను బెదిరించాడు. బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. ముంబయి వచ్చాక కూడా ఆయన్నుంచి బెదిరింపు కాల్స్ రావడం, మెసేజ్‌లు పంపించాడు. ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. ఆయన వల్లే తనకు ముంబయి రావాల్సిన ఫ్లైట్‌ కూడా మిస్‌ అయ్యింది. దీంతో నన్ను ఓ గ్రామంలో ఉంచాడు. ఆయన చెప్పినట్టు వినకపోతే అక్కడే వదిలేసి పోతానని చెప్పాడు. ఆ సమయంలో ఆయన చెప్పినట్టు వినకపోతే నాపై అత్యాచారం చేసేవాడేమో. చంపేసేవాడేమో అనిపించింది` అని పేర్కొంది. 

`నా కారుని ఆయన కార్యకర్తలు అడ్డుకునేవారు, ఆయన మాట వినేంత వరకు నా కారుని కదలనివ్వలేదు. ఓ రకంగా అతను కావాలని ట్రాప్‌ చేసి నా లైఫ్‌ని రిస్క్ లో పెట్టాడు` అని ఆరోపించింది. దీనిపై అభ్యర్థి ప్రకాష్‌ చంద్ర స్పందించారు. అమీషా వ్యాఖ్యలను ఖండించాడు. ఆమె కారు షో కోసం అన్ని రకాల భద్రత చర్యలు తీసుకున్నాం. ప్రజల మద్దతులో నేను గెలవాలనుకున్నా. కానీ నా బంధువుల్లో ఒకరు ఒబ్రాలో అమీషా పటేల్‌ తో ర్యాలీ నిర్వహించారు. దౌద్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌ఛార్జ్ అమీషా కి చెందిన భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆమె ఆరోపించినట్టు ఏమీ జరగలేదు` అని అన్నారు. 

ఆయన ఇంకా చెబుతూ, `బీహార్‌లో ఆర్టిస్టులు లేరా..? సోనాక్షి కూడా ఇక్కడి నుంచే ఉన్నారు. అమీషా విమానాశ్రయంలో పప్పు యాదవ్‌ని కలిశారు. వారు 15లక్షల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారు. తనకి అనుకూలంగా వీడియో చేయడానికి అమీషా పటేల్‌ ఎక్కువ డబ్బు కోరింది. నా డ్రైవర్‌ అమీషా పీఏతో మాట్లాడారు. ఆమె నాకు అనుకూలంగా మరో వీడియో చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. దాని కోసం పది లక్షలు డిమాండ్‌ చేశారు. నేను చదువుకున్న వ్యక్తిని, చదువుకున్న సంస్థ నుంచి వచ్చాను. ఇలాంటి నేను చేయలేదు. ఆమె ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి` అని ఆయన పేర్కొన్నారు. 
 

click me!