‘బ్రో’పై అంబటి రాంబాబు మరోసారి వెటకారం

Published : Aug 01, 2023, 03:02 PM IST
‘బ్రో’పై అంబటి రాంబాబు మరోసారి వెటకారం

సారాంశం

  ఒక సీన్ లో అయితే ఏపీ మంత్రి అంబటి రాంబాబు గతంలో చేసిన డాన్స్ పై  పరోక్షంగా ఘాటైన సెటైర్లు వేయటం మాత్రం వైరల్ అయ్యింది. ఈ విషయమై ఫృద్వీ,నిర్మాత , సాయి తేజ కూడా మాట్లాడారు


పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు  సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కలిసి నటించిన చిత్రం ‘బ్రో’ (BRO). కేతిక శర్మ (Ketika Sharma), ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ (Priya Prakash Varrier) హీరోయిన్స్ గా చేసిన ఈ చిత్రం మొన్న శుక్రవారం  రిలీజ్ అయ్యింది.   ఇది 'వినోదయ సిత్తం' #VinodhayaSitham అనే తమిళ సినిమాకి రీమేక్. తమిళ సినిమాకి దర్శకత్వం వహించిన సముద్రఖని, తెలుగు సినిమాకి కూడా దర్శకత్వం వహించాడు. తమిళ సినిమాలో సముద్రఖని ప్రముఖ పాత్రలో నటించాడు కూడా, అదే పాత్రని తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించాడు.  ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించటం విశేషం. ఈ సినిమాలో ఫిలాసఫీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు పొలిటికల్‌ పంచ్‌లు కూడా బాగానే ఉన్నాయి. 

ముఖ్యంగా ఈ సినిమా సెకండాఫ్ లో వచ్చే   ఒక సీన్ లో అయితే ఏపీ మంత్రి అంబటి రాంబాబు గతంలో చేసిన డాన్స్ పై  పరోక్షంగా ఘాటైన సెటైర్లు వేయటం మాత్రం వైరల్ అయ్యింది. ఈ విషయమై ఫృద్వీ,నిర్మాత , సాయి తేజ కూడా మాట్లాడారు. అంబటి రాంబాబు తనని టార్గెట్ చేస్తున్న విషాయన్ని  దృష్టిలో పెట్టుకుని మొదట ఓ సారి కౌంటర్ ఇచ్చారు. గెలిచినోడి డాన్స్ సంక్రాంతి ! ఓడినోడి డాన్స్ కాళరాత్రి ! అన్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్స్ పై సెటైర్ వేసారు. నాలుగో రోజుకు కలెక్షన్స్ ఫుల్ గా డ్రాప్ అవటాన్ని గమనించి ఆయన డైరక్ట్ గానే కౌంటర్ వేసారు.

ఇక   'బ్రో' సినిమాలో స్పెషల్ సాంగ్ గా  'మై డియర్ మార్కండేయ' పాటలో  ఊర్వశి రౌతేలా హాట్ హాట్ స్టెప్పులు వేశారు. ఆ పాటలో శ్యాంబాబు అంటూ ఆ మంత్రి మీద సెటైర్లు పడ్డాయి. ఈ శ్యాంబాబు క్యారెక్టర్ చేసింది '30' ఇయర్స్ పృథ్వీ.  అదెలా అంటే...'మై డియర్ మార్కండేయ...' పాటలో శ్యాంబాబుగా పృథ్వీరాజ్ గెటప్ చూస్తే...   ఏపీ మంత్రి  అంబటి రాంబాబు గతంలో చేసిన డ్యాన్స్ ఎవరికైనా  గుర్తుకు వస్తుంది.  ట్రాక్ ప్యాంటు & టీ షర్టులో మాత్రమే ఉంటూ  రెండు చేతులు ముందుకు పెట్టి  ఓ స్టెప్ వేస్తారు. అప్పుడు పాటను ఆపి ''శ్యాంబాబు వస్తున్న టెంపో ఏంటి? నువ్వు వేస్తున్న స్టెప్ ఏంటి?'' అని పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకుంటారు.  కావాలనే సినిమాలో పృథ్వీ పేరు శ్యాంబాబు పెట్టారని... ఏపీలో మంత్రిని ఉద్దేశించి ఆ క్యారెక్టర్ క్రియేట్ చేశారనేది అందరికీ అర్దమైంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌