
‘పఠాన్’తెలుగులోనూ బాగా ఆడింది. ఆ జోష్ తో ఉన్న షారుఖ్ ఖాన్ ‘జవాన్’కు ట్రేడ్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే ప్రతీ సినిమా పఠాన్ అవుతుందా లేదో కానీ జవాన్ రైట్స్ కు చెప్తున్న రేటు విని కంగారుపడుతున్నారు. అయితే వారికి ఒకటే ధైర్యం షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీ ట్రైలర్. ఇప్పటికే విడుదలైన ఆ ట్రైలర్ చూసిన వారందరికీ బంప్స్ వస్తున్నాయి. ఈ మాసియెస్ట్ ట్రైలర్ సినీ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. 2 నిమిషాల 12 సెకన్లలో కింగ్ ఖాన్ షారూఖ్ సత్తా చూపించాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో అదుర్స్ అనిపిస్తోంది. ఆ ట్రైలర్ ని అడ్డం పెట్టి తెలుగులో బీబత్సమైన బిజినెస్ చేయాలని స్కెచ్ వేసారు.
అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం 23 కోట్ల వరకు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షారుక్ హీరోగా రూపొందిన పటాన్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 56 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. దానితో ఈ అంకెను ఫిక్స్ చేసారు. ఇదే రేటుకు కనుక బిజినెస్ అయితే జవాన్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లే. ఇక ఈ సినిమా 23 కోట్లకు కనుక కొంటే ..పఠాన్ లాగ హిట్ అయ్యి ..యాభై కోట్లు గ్రాస్ రావాలి. అప్పుడే 23 కోట్లువెనక్కి వస్తుంది.
ఇక ఈ చిత్రం ట్రైలర్ ‘‘ఎవరు నేను? ఎవరిని కాను. ఎవరిని కాను. తెలియదు. తల్లికి ఇచ్చిన మాట కావచ్చు, నెరవేరని లక్ష్యం కావచ్చు. నేను మంచి వాడినా? చెడ్డవాడినా? పుణ్యాత్ముడినా? పాపాత్ముడినా? నీకు నువ్వే తెలుసుకో. ఎందుకంటే నేనే నువ్వు’’ అంటూ షారుఖ్ వాయిస్ తో మెట్రో స్టేషన్ లో ట్రైలర్ మొదలవుతుంది. “నేను విలన్ అయితే, ఏ హీరో నా ముందు నిలబడలేడు” అంటూ కింగ్ ఖాన్ గర్జన అదరగొడుతుంది. అంతేకాదు.. చివర్లో గుండుతో షారుఖ్ ఖాన్ తన అభిమానులకు షాకిచ్చాడు. ఓ ఓల్డ్ సాంగ్‌కు ఫన్నీగా డ్యాన్స్ చేస్తూ విలనిజం చూపించాడు. దీపికా పదుకొనే, నయనతార, ప్రియమణి యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టారు. ఇక ఈ మూవీ విడుదలయ్యాక ఇండియా బాక్సాఫీస్ రీకార్డ్స్ అన్నింటిని అధిగమిస్తుందని అంటున్నారు. చూడాలి మరి.