
సుహాస్ హీరోగా దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎమోషనల్ మూవీ అంబాజీపేట మ్యారేజి బ్యాండు. రీసెంట్ గా మన ముందుకి వచ్చిన ఈ మూవీ బాగుందనే టాక్ తెచ్చుకుంది. అయితే చిన్న సినిమా కావటంతో థియేటర్ లో అందరూ చూపటానికి ఉత్సాహం చూపలేదు. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.ఈ మేరకు అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. #AmbajipejaMarriageBand ఆహా ఓటీటిలో ఈ మూవీ మార్చి 1 నుండి స్ట్రీమింగ్ కానున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది.
చిత్రం కథేమిటంటే...
అంబాజీపేట మ్యారేజి బ్యాండులో ఉండే మల్లి (సుహాస్) చిరతపూడిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. అక్క పద్మ (శరణ్య ప్రదీప్) ఆ ఊరి స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఊరి మోతుబరి వెంకట్‌బాబు (నితిన్ ప్రసన్న) వల్లే పద్మకి ఉద్యోగం వచ్చిందని, వాళ్లిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే రూమర్ మొదలవుతుంది. ఇంతలో వెంకట్‌బాబు చెల్లెలు లక్ష్మి (శివాని నాగారం), మల్లి ప్రేమలో పడతారు. వెంకట్‌బాబు తమ్ముడికి, మల్లికి మధ్య ఊళ్లో గొడవ, ఆ తర్వాత స్కూల్ విషయంలో పద్మకీ, వెంకట్‌బాబుకీ మధ్య చిన్న సైజు యుద్దం మొదలవుతుంది. ఇంతలో మల్లి, లక్ష్మిల మధ్య ప్రేమ సంగతి కూడా బయటపడుతుంది. ఎలాగైనా ఆ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకోవాలని ఓ రోజు వెంకట్‌బాబు... రాత్రి వేళలో పద్మని స్కూల్‌కి పిలిపించి అవమానిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మల్లి, లక్ష్మిల ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుందనేది మిగతా కథ. #AmbajipejaMarriageBand
అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాలో శివాని నాగరం హీరోయిన్‌గా నటించింది. కలర్‌ఫొటో, రైటర్ పద్మభూషణ్ తర్వాత హీరోగా అంబాజీపేట మ్యారేజి బ్యాండుతో సుహాస్ హ్యాట్రిక్ హిట్‌ను అందుకున్నాడు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ మూవీని ధీరజ్ మొగిలినేని ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. గోపరాజు రమణ, జగదీశ్ ప్రతాప్ బండారి, స్వర్ణకాంత్ తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ మూవీ ఎంతమేర ఓటిటి ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి. #AmbajipejaMarriageBand