మరో వివాదంలో మహేష్ AMB మల్టిప్లెక్స్?

By Prashanth MFirst Published 20, Feb 2019, 7:50 PM IST
Highlights

మహేష్ బాబు కి సంబందించిన AMB సినిమాస్ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సినిమా థియేటర్ కి సంబందించిన టికెట్స్ విషయంలో అమలైన జీఎస్టీకి విరుద్ధంగా అధిక రేట్లకు టికెట్స్ ను అమ్మినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై మహేష్ కో పాట్నర్ సునీల్ కూడా స్పందించారు. 

అధికారులు అడిగిన వివరాలు ఇచ్చాము అని తప్పుడుగా అధిక రేట్లకు టికెట్స్ అమ్మలేదని వివరణ ఇచ్చారు. ఇక ఇప్పుడు మరో వివాదంలో AMB మల్టిప్లెక్స్ చిక్కుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాణం కోసం ఏషియన్ సునీల్ నారంగ్ ఇతరుల నుంచు భూమిని కొనుగోలు చేశారు. అయితే తప్పుడు పాత్రలతో వివిధ బ్యాంకులలో ఋణాలు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

ఒక భూమి పత్రంతో దాదాపు మూడు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. మహేష్ బాబుకి సంబందించిన థియేటర్ పై ఆరోపణలు రావడంతో ఇప్పుడు మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.    

30+ ఈ స్టార్స్ ఇంకా పెళ్లి చేసుకోలేదు

Last Updated 20, Feb 2019, 8:01 PM IST