కొద్దికాలం క్రితం వరకూ ఓ సినిమా రిలీజైందంటే...అది 50 రోజులు.. 100 రోజులు.. 150 రోజులు.. 175 రోజులు.. 200రోజలు 250 రోజులు ఏడాది.. ఎలా సినిమా ఎన్ని ఎక్కువ రోజులు ఆడిందనే లెక్కలు నడిచేవి. కానీ ఆ తర్వాత ఆ ప్లేస్ లో కలెక్షన్లు వచ్చి చేరాయి.ఇప్పుడు అదీ పోయింది..ఎప్పుడు ఓటీటి రిలీజ్ అని అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ కరోనా టైమ్ లో తాము చూద్దామనుకున్న చిత్రాన్ని ఓటీటిలో వచ్చినప్పుడు చూద్దామనుకునేవాళ్లు ఎక్కువ అయ్యారు. ఇప్పుడు చాలా మంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రం పై ఉంది.
బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుని ఫస్ట్ వీక్ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ సినిమా కరోనా దెబ్బతో చతికిలపడింది. అయితే చాలా మంది చూద్దామనుకున్న వాళ్లు రిపీట్ ఆడియన్స్ ...థియోటర్ కు వెళ్లటానికి జంకుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ సినిమా ఓటీటి రిలీజ్ కు ప్రాధాన్యత ఏర్పడింది. ఇది గమనించిన దిల్ రాజు..ఓటీటీలో చూడద్దు ..థియోటర్ లోనే చూడండి అన్నారు. కానీ అంత ధైర్యం ఎవరికి ఉంది. పవన్ కళ్యాణ్ కు కూడా కరోనా వచ్చాక..ఇంకా చాలా జాగ్రత్తాగా ఉంటున్నారు.
ఇక ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని అమేజాన్ ప్రైమ్ వాళ్లు సొంతం చేసుకున్నారు. దిల్ రాజు తన దగ్గర ఉన్న ఎఫ్ 3, వకీల్ సాబ్, షాదీ ముబారక్, రౌడీ బోయిస్ చిత్రాల రైట్స్ అన్ని కలిపి అమ్మారు. అమేజనా ప్రైమ్ లో ఈ సినిమాలు అన్ని త్వరలో స్ట్రీమ్ కానున్నాయి. సాధారణంగా ఎగ్రిమెంట్ ప్రకారం సినిమా రిలీజ్ అయ్యిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో ప్రసారం చేయచ్చు. అదే విధంగా వచ్చే నెలలో వకీల్ సాబ్ ని భారీ ఎత్తున పబ్లిసిటీ చేసి స్ట్రీమ్ చేయబోతోందని సమాచారం.
సినిమా ఏప్రిల్ 9 న రిలీజైంది కాబట్టి నెల తర్వాత అంటే మే 9 తర్వాత అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి రానున్నది. ఆ డేట్ కాకపోతే మే 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో వకీల్ సాబ్ స్ట్రీమింగ్ కానుంది. ఏదనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. మరోవైపు జీ సినిమాస్ వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది. దీనికోసం కూడా 15 కోట్ల వరకు పెట్టినట్లు తెలుస్తుంది.