ఆస్కార్‌ బరిలో ప్రియాంక చోప్రా సినిమా.. అదృష్టం వరించేనా?

Published : Apr 23, 2021, 08:34 AM IST
ఆస్కార్‌ బరిలో ప్రియాంక చోప్రా సినిమా.. అదృష్టం వరించేనా?

సారాంశం

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా చిత్రం కూడా ఉండటం విశేషం. ఆమె నటించిన `ది వైట్‌ టైగర్‌` ఆస్కార్‌ అవార్డు కోసం పోటీలో ఉంది. ఈ ఇండియా- అమెరికా చిత్రం ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్‌కి పోటీపడుతుంది.   

ప్రతిష్టాత్మక ఆస్కార్ పండుగ మరికొద్ది రోజుల్లో జరగబోతుంది. ఈ నెల 26న ఈ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సారి కూడా అమెరికా చిత్రాలతోపాటు విదేశీ విభాగంలో అనేక ఇతర దేశాలకు చెందిన సినిమాలు కూడా పోటీపడుతున్నాయి. అందులో గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా చిత్రం కూడా ఉండటం విశేషం. ఆమె నటించిన `ది వైట్‌ టైగర్‌` ఆస్కార్‌ అవార్డు కోసం పోటీలో ఉంది. ఈ ఇండియా- అమెరికా చిత్రం ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో ఆస్కార్‌కి పోటీపడుతుంది. 

`మదర్‌ ఇండియా`, `సలామ్‌ బాంబే`, `లగాన్‌` చిత్రాల తర్వాత ఇండియాకి చెందిన ఓ సినిమా ఆస్కార్ కి నామినేట్‌ కావడం విశేషం. అయితే ఇది పూర్తి స్థాయి ఇండియన్‌ సినిమా కాకపోవడం గమనార్హం. 2002లో `లగాన్‌` తర్వాత అంటే దాదాపు ఇరవైఏళ్ల తర్వాత ఇండియాకి చెందిన సినిమా ఆస్కార్‌ బరిలో నిలవడం విశేషం. దీంతో ఆసక్తి నెలకొంది. ఈ  ఏప్రిల్‌ 26వ తేదీ ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ స్టార్‌ మూవీస్, స్టార్‌ వరల్డ్‌ ఛానెల్స్‌లో ఈ పురస్కారాల పండుగ ప్రసారమవుతోంది. 

`ద వైట్‌ టైగర్‌` సినిమాలో ప్రియాంక చోప్రాతోపాటు రాజ్‌ కుమార్‌ రావ్‌, ఆదర్శ్‌ గౌరవ్‌ నటించారు.అమెరికా దర్శకుడు రామిన్‌ బహ్రాని దర్శకత్వం వహించారు. ముంబయికి చెందిన నిర్మాత ముఖుల్‌ డియోరా నిర్మించారు. ఇది ఇప్పటికే అమెరికాలో విడుదలై ఆకట్టుకుంది. నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైంది. మరి ఈ సారి ఆస్కార్‌ బరిలో ఉన్న ఈ సినిమాకి అవార్డు వరిస్తుందా? అదృష్టం వరిస్తుందా? అన్నది చూడాలి. ఒకవేళ అవార్డు వచ్చినా అది అమెరికా డైరెక్టర్‌కే కావడం గమనార్హం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌