మల్టీపుల్‌ టాస్క్స్ చేసిన దీపికా పదుకొనె.. వీడియో వైరల్‌

Published : Apr 23, 2021, 09:12 AM IST
మల్టీపుల్‌ టాస్క్స్  చేసిన దీపికా పదుకొనె.. వీడియో వైరల్‌

సారాంశం

దీపికా పదుకొనె వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతుంది. అందులో ఆమె పలు రకాల టాస్క్ లు అన్నీ తానై చేసిన విధానంగా ఆడియెన్స్ ఆకట్టుకుంటుంది. టెక్నాలజీని మిక్స్ చేసి రూపొందించిన ఈ వీడియో ఇప్పుడు ఎక్కడ చూసి హల్‌చల్‌ చేస్తుంది. 

బాలీవుడ్‌ సూపర్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనె వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతుంది. అందులో ఆమె పలు రకాల టాస్క్ లు అన్నీ తానై చేసిన విధానంగా ఆడియెన్స్ ఆకట్టుకుంటుంది. టెక్నాలజీని మిక్స్ చేసి రూపొందించిన ఈ వీడియో ఇప్పుడు ఎక్కడ చూసి హల్‌చల్‌ చేస్తుంది. ఇందులో దీపికా చేసే పనులు కనువిందు చేస్తున్నాయి. దీపికా పదుకొనె ఇటీవల తన సోషల్‌ మీడియా ద్వారా ఈ వీడియోని పంచుకుంది. ఇందులో దీపికా.. ఓ హోటల్‌లో ఆర్డర్‌ ఇవ్వడం, వాటిని మరో దీపికాకి అందించడం, ఆమె వాటిని తీసుకెళ్లడం, ఓ చోటు ఉన్న ఐటెమ్స్ ని మరో చోట పెట్టడం, అక్కడే యోగా చేయడం, పని అయిపోయినట్టుగా రిలాక్స్ అవ్వడం చూపించారు. ఆరుగురు దీపికాలను చూపించారు. హోటల్‌లో వర్కర్స్ ఏం చేస్తుంటారో అవన్నీ దీపికా చేస్తున్నట్టుగా యానిమేటెడ్‌ స్టయిల్‌లో దీన్ని రూపొందించారు. 

ఈ వీడియోని దీపికా తన ఇన్ స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది. `ఈ ప్రపంచం నుంచి.. ఇన్నిట్‌` అని పేర్కొంది. ఇందులో తాను మల్టీపుల్‌ కలర్స్ మిక్స్ అయిన లాంగ్‌ టీషర్ట్ ధరించి, వైట్‌ షూస్‌ వేసుకుంది దీపికా. చిలిపిగా వ్యవహరించింది. స్సెషల్‌ ఎఫెక్ట్స్ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతోపాటు తాజాగా షూటింగ్‌ సెట్‌కి సంబంధించి స్సెషల్‌గా రూపొందించిన వీడియో కూడా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ఇదిలా ఉంటే దీపికా ప్రస్తుతం భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి `83`లో నటిస్తుంది. ఇది విడుదలకు రెడీగా ఉంది. దీంతోపాటు అమిత్‌ శర్మ దర్శకత్వంలో `ది ఇంటెర్న్` సినిమా చేస్తుంది. అలాగే షారూఖ్‌తో `పఠాన్‌`లో నటిస్తుంది. వీటితోపాటు శకున్‌ బట్రా దర్శకత్వంలో మరో సినిమా చేయబోతుంది. `సర్కస్‌`లో గెస్ట్ గా మెరవబోతుంది. మొత్తంగా మూడు సినిమాలతో బిజీగా ఉంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?