Bigg Boss Telugu 7 : లాస్ట్ వీక్.. అమర్ దీప్, అర్జున్ ల జర్నీపై బిగ్ బాస్ ఓపీనియన్.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్

By Asianet News  |  First Published Dec 11, 2023, 10:58 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా చివరి వీక్ కు ఆరుగురు కంటెస్టెంట్లు చేరుకున్నారు. తాజా ఎపిసోడ్ లో అమర్ దీప్, అర్జున్ జర్నీలపై బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 
 


బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 (Bigg  Boss Telugu 7)  చివరి వారంలోకి అడుగుపెట్టింది. ఈ వీక్ లో పెద్దగా గేమ్స్ ఉండవు. ఆదివారం శోభాశెట్టి ఎలిమినేట్ అవ్వడంతో హౌజ్ లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో టైటిల్ విన్నర్ ఎవరనేది చాలా ఆసక్తికరంగా మారింది. గేమ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా చివరి వీక్ కు ఆరుగురు కంటెస్టెంట్లు చేరుకున్నారు. ప్రస్తుతం హౌజ్ లో అమర్ దీప్, అర్జున్, శివాజీ, ప్రియాంక, పల్లవి ప్రశాంత్, యావర్ ఉన్నారు. ఫైనల్స్ కు చేరిన వీరిలో ఎవరికి టైటిల్ దక్కుతుందనేది ఆసక్తికరంగా. ఇక తాజా ఎపిసోడ్ లో అమర్ దీప్, అర్జున్ జర్నీలపై బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

చివరి వారం పెద్దగా గేమ్స్, టాస్క్స్ ఉండవు. టాప్ 6 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ జర్నీని అందంగా ఆవిష్కరిస్తారు. ఫస్ట్ ఛాన్స్ అమర్ దీప్ కి వచ్చింది. అమర్ దీప్ కోసం ఓ గదిని అందంగా డెకరేట్ చేశారు. బిగ్ బాస్ హౌస్లో అమర్ దీప్  (Amardeep)  కి సంబంధించిన అరుదైన ఘట్టాలకు సంబంధించిన ఫోటోలు, వస్తువులను అక్కడ ఉంచారు. అతని జర్నీ గురించి మాట్లాడుతూ... అమర్ ఏంటి ఇలా ఆడుతున్నాడు అనుకుంటాం, వీకెండ్ లో హోస్ట్ ఇచ్చిన క్లాసులు కి అమర్ కాన్ఫిడెన్స్ చాలా బలహీనంగా ఉంది. అదే వేరే వాలు ఆ పొజిషన్ లో ఉంటే వాలు అసలు మళ్లీ కొలుకోవడం చాలా కష్టం. అమర్ లోలోపల ఎంత కుంగి పోయినా, పోరాడాలని ప్రయత్నించాడు, ఎంత మంది థానని అవహేళన చేసినా, అవమానించిన గెలవాలనే తాపన చూపించాడు. 

Latest Videos

నా అనుకునేవారి కోసం ఎలా నిలబడాలో చూపించాడు. కోపం వస్తే ఊగిపోవడం, బాధ వస్తే అల్లాడిపోవడం అమర్ సహజ వ్యక్తిత్వం. శివాజీ లాంటి పెద్ద మనుషులు ఎంత మాట అనినా, వాల మనుషులు ఎలా హెలనా చేసిన వాటిని ఈజీగా తీసుకోవద్దు అంటే అమర్ మనసు ఎంతో చూపిస్తుంది. శత్రువు (ఆటలో మాత్రమే) లాంటి వారి నుండి కూడా ఎదో ఒక గుణం నేర్చుకుంటాను అని అందరి ముందు చెప్పగలిగే గొప్ప గుణం ఉన్న వ్యక్తి అమర్. ఇంకా అమర్ చేసిన తప్పులు గురించి మాట్లాడుకుంటే - ఫౌల్స్ అనేవి గేమ్ లో విన్ అవాలనే ప్రయత్నంలో జరిగినవి, కావల్నే చేసాడు అని నేను అనుకోవటం లేదు. ఫ్రూట్ జ్యూస్ టాస్క్ లో లెగ్ లైన్ ముందుకు పెట్టడం, ఫ్లోట్ లేదా సింక్ గేమ్ లో సమాధానాలు చెప్పమని చెప్పడం, సౌండ్స్ గెస్ చేసే దగరా కాపీ కొట్టడం, స్టిక్ ఐనా బాల్స్ బాడీ నుండీ తీసుకోవడం, వీటితో ఎక్కువ నెగిటివిటీకి గురైంది.

అనంతరం అర్జున్ అంబటి (Arjun Ambati)  గురించి కూడా బిగ్ బాస్ మాట్లాడారు. ఓ గదిని అందంగా డెకరేట్ చేసి.. అక్కడ అర్జున్ అరుదైన ఘట్టాలకు సంబంధించిన ఫోటోలు, వస్తువులను అక్కడ ఉంచారు. అతని జర్నీ గురించి మాట్లాడుతూ... అర్జున్ మొదటి  రోజు నుంచి ఆడిన తీరు ఎంతో ఆసక్తికరంగా ఉందని చెప్పారు. తను ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉన్నా.. తన ఫోకస్ మొత్తం గేమ్ పెట్టి అలరించారని చెప్పారు. అతని ఓపికా, గేమ్ పట్ల తను పెట్టిన శ్రద్ధా ఆకట్టుకుందన్నారు. పలు గేమ్స్ ల్లోనూ అర్జున్ కనబర్చిన ప్రతిభ బాగుందన్నారు. పలు మైనస్ లనూ గుర్తుచేశారు.  

ఇక ఈ సీజన్ లో అమర్ దీప్ టైటిల్ ఫేవరేట్ గా  అవుతున్నాడు. అయితే పల్లవి ప్రశాంత్ అనూహ్యంగా అభిమానులను పెంచుకుని టైటిల్ రేసులో దూసుకుపోతున్నాడు. పల్లవి ప్రశాంత్ ని దాటి టైటిల్ అందుకోవడం అంత సులభం కాదు. అలాగే శివాజీ కూడా టైటిల్ రేసులో ఉన్నాడు. ఈ ముగ్గురిలో ఒకరు విన్నర్ అవుతారనేదిచూడాలి. ప్రముఖ మీడియా సంస్థల అనధికారిక సర్వేలలో పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు. ఇక టైటిల్ ఎవరిని వరిస్తుందో చూడాలి.

click me!