తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యంపై తాజగా చిరంజీవి ఆరా తీశారు. యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K. Chandrashekar Rao) హిప్ రీప్లేస్ మెంట్ తర్వాత కోలుకుంటున్నారు. తాజగా సినీ పరిశ్రమ నుంచి కూడా కేసీఆర్ కోలుకోవాలని ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఇక తాజాగా మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్, కవితకూ ధైర్యం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
బీఆర్ ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ బాత్‌రూంలో జారి పడటంతో తీవ్రగాయమై ఆసుపత్రి పాలయ్యారు. ఇది బీఆర్ఎస్ శ్రేణులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాయి. గత గురువారం రాత్రి ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో కేసీఆర్ కాలుజారి పడిపోయారు. వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి తరలించారు. దీంతో డాక్టర్ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్యుల బృందం పలు పరీక్షలు నిర్వహించి తుంటి ఎముక విరిగినట్లుగా గుర్తించి శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. రీసెంట్ గా హిప్ రీప్లేస్ మెంట్ కూడా విజయవంతం అయ్యింది.
undefined
వైద్యులు కూడా వాకర్ తో KCRను నడక ప్రాక్టీస్ చేయించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యంపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కోలుకుంటుండటంతో ఒక్కొక్కరుగా వెళ్లి పరామర్శిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) , మాజీ మంత్రులు కూడా పరామర్శించారు.