యూఎస్ ప్రీమియర్ షో టాక్:అమర్ అక్బర్ ఆంటోనీ

By Prashanth MFirst Published Nov 16, 2018, 7:46 AM IST
Highlights

శ్రీనువైట్ల - రవితేజ కాంబినేషన్ లో వచ్చిన నాలుగవ చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. గత కొంత కాలంగా విజయం కోసం ఎంతగానో కష్టపడుతున్న ఈ ఇద్దరు ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని కలిశారు. యాక్షన్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక యూఎస్ లో సినిమా ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఆ టాక్ ఎలా ఉందొ చూద్దాం.
 

 

కథ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏమి లేవు. దర్శకుడు ట్రైలర్ లో ఇది రివెంజ్ స్టోరీ కాదని రిటర్న్ గిఫ్ట్ అన్నాడు. అయితే సినిమాలో కాస్తా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో రివెంజ్ స్టోరీని డిఫరెంట్ గా చూపించాడు శ్రీను వైట్ల. రవితేజ (అమర్) - ఇలియాన (ఐశ్వర్య) పెరెంట్స్ ను చంపాలని వారి సన్నిహితులు ప్లాన్ చేయడం నుంచి కథ మొదలవుతుంది. 

2003 ఫ్లాష్ బ్యాక్ కథను మలిచిన తీరు బాగానే ఉంది. ఇక ఇంటర్వెల్ సమయానికి రవితేజకు సంబంధించిన మూడు విభిన్నమైన క్యారెక్టర్స్ ని దర్శకుడు చూపించిన విధానం కూడా బావుంది. అయితే ఫస్ట్ హాఫ్ టోటల్ గా అంతా గొప్పగా ఏమి అనిపించదు. యావరేజ్ అని చెప్పవచ్చు. రివెంజ్ స్టోరీలోనే వైట్ల తన మార్క్ కామెడీని చూపించేందుకు ప్రయత్నం చేశాడు. 

అమెరికా లొకేషన్స్ చాలా బాగున్నాయి. నిర్మాతలు ఏ మాత్రం రాజీపడకుండా ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. 

ఇక 14 ఏళ్ళు రవితేజ అక్కడి జైల్లో ఉండటం. ఆ తరువాత ఇలియానాను కలవడం ఇక వారి పేరెంట్స్ ను చంపిన వారిని ఎలా అంతమొందించారు అనేది మిగతా కథ. సినిమా యూఎస్ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. అక్కడ తెలుగు అసోసియేషన్ లకు సంబంధించిన ఈవెంట్స్ లలో ఇలియాన మేనేజ్మెంట్ లో పనిచేస్తుంటుంది. 

ఇక కమెడియన్స్ కూడా అందులో భాగం కావడం ఆ తరువాత వచ్చే కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. సునీల్ పాత్ర పరవలేదనిపించింది కానీ అనుకున్నంత స్థాయిలో అయితే వర్కవుట్ కాలేదు. ఇక మిగతా కమెడియన్స్ వారి పరిధిలో మంచి టైమింగ్ తో ఆకట్టుకున్నారు. 

సెకండ్ ఆఫ్ కి వచ్చే సరికి దర్శకుడు కొంచెం ఆసక్తిని రేపినప్పటికి అంచనాలను అందుకోవడం లో కొంచెం తడబడినట్లు టాక్ వస్తోంది. ఇక రవితేజ మరోసారి తన మార్క్ ఎనర్జిటిక్ పర్ఫెమెన్స్ తో ఆకట్టుకున్నాడు. 

అయితే ఫైనల్ గా సినిమా రొటీన్ యాక్షన్ సినిమా అని తెలిపోయింది. ఫస్టాఫ్ లో అమెరికాలో ఉన్న తెలుగు అశోశియేషన్స్ ని వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ చేసిన వాటా కామెడీ తేలిపోయాయని సమాచారం.  అవి చాలా ఫోర్సెడ్ గా...అవుట్ డేటెడ్ గా ఉన్నాయంటున్నారు. సెకండాఫ్ కూడా సోసో గా ఉందని, దూకుడు టైప్ ఫార్స్ సీన్స్ తో నడిపే ప్రయత్నం చేసారని, క్లైమాక్స్ కూడా పరమ రొటీన్ వ్యవహారమే అని ఎన్నారైలు తేల్చేస్తున్నారు.  

click me!
Last Updated Nov 16, 2018, 7:49 AM IST
click me!