విజయ్ మరో రాజకీయ చిత్రం..పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?

By Prashanth MFirst Published Nov 15, 2018, 9:05 PM IST
Highlights

తమిళనాడులో రాజకీయ వివాదాలు మొదలయ్యాయి అంటే తప్పకుండ అందులో సినీ నటుల పాత్ర ఎంతో కొంత ఉంటుంది. రీసెంట్ గా అన్నాడీఎంకే పార్టీని సర్కార్ సినిమా ఉక్కిరిబిక్కిరి చేసిన సంగతి తెలిసిందే.

తమిళనాడులో రాజకీయ వివాదాలు మొదలయ్యాయి అంటే తప్పకుండ అందులో సినీ నటుల పాత్ర ఎంతో కొంత ఉంటుంది. రీసెంట్ గా అన్నాడీఎంకే పార్టీని సర్కార్ సినిమా ఉక్కిరిబిక్కిరి చేసిన సంగతి తెలిసిందే. చాలా వరకు వివాదాలు ఆకాశాన్ని తాకాయి. మరింత ఉదృతం కాకముందే పోలీసులు జాగ్రత్త వహించడంతో ఎలాంటి ఘటనలు జరగలేదు. 

కానీ దర్శకుడు మురగదాస్ కథానాయకుడు విజయ్ ఇప్పటికి డేంజర్ జోన్ లో ఉన్నట్లు అవకాశం వచ్చినప్పుడు వారిని టార్గెట్ చేసే అవకాశం ఉందని తమిళ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పొలిటికల్ ఎంట్రీ కోసమే విజయ్ సినిమా చేశాడని టాక్ బాగా వచ్చింది. ఇక మరోసారి ఆ టాక్ వైరల్ అయ్యేలా విజయ్ ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఎందుకంటే నెక్స్ట్ విజయ్ అట్లీ దర్శకత్వంలో తన 63వ సినిమాను చేయనున్నాడు. వీరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన తేరి - మెర్శల్ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఒక పొలిటికల్ డ్రామాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 

ఇక సినిమా టైటిల్ ను ఆళపోరాన్‌ తమిళన్‌ అని అట్లీ రిజిస్ట్రేషన్ చేయించాడు. తమిళుడు పాలించడానికి వస్తున్నాడనేది దానర్ధం. ఈ టైటిల్ ఇప్పుడు తమిళనాడులో వైరల్ గా మారింది. విజయ్ మరొక కొత్త రాజకీయ టచ్ ను ఇవ్వనున్నాడని పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయమైనట్లే అని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి విజయ్ ఏ విధంగా అడుగులు వేస్తాడో చూడాలి.

click me!