నగ్నంగా అమలాపాల్.. మరీ ఇంత బోల్డా.. టీజర్ వైరల్!

Published : Jun 18, 2019, 08:01 PM IST
నగ్నంగా అమలాపాల్.. మరీ ఇంత బోల్డా.. టీజర్ వైరల్!

సారాంశం

సంచలన నటి అమలా పాల్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆడై'. తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రత్నకుమార్ దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. 

సంచలన నటి అమలా పాల్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆడై'. తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రత్నకుమార్ దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. వివాహ జీవితంలో ఇబ్బందులు తలెత్తాక అమలా పాల్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తమిళ దర్శకుడు విజయ్ ని వివాహం చేసుకుని ఆ తర్వాత అతడి నుంచి అమలాపాల్ విడిపోయిన సంగతి తెలిసిందే. 

పెళ్ళికి ముందు వరకు గ్లామర్ పాత్రలు చేస్తూ అందాలు ఆరబోసింది. కానీ ఇటీవల అమలాపాల్ లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. తాజాగా ఆడై చిత్రంతో అమల పెద్ద సంచలనమే రేపేలా కనిపిస్తోంది. ఆడై చిత్ర టీజర్ కొద్ది సేపటి క్రితమే విడుదలయింది. ఈ టీజర్ లో ఒంటిపై నూలు పోగు లేకుండా అమలాపాల్ నగ్నంగా నటించింది. 

దీనితో ఆడై టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత బోల్డ్ పాత్రలో నటిస్తూ కెరీర్ లో తొలిసారి అమలాపాల్ సాహసం చేస్తోందని చెప్పొచ్చు. ఓ బిల్డింగ్ లో అమలాపాల్ భయపడుతూ నగ్నంగా కనిపిస్తుంది. దీని ద్వారా దర్శకుడు టీజర్ లో సస్పెన్స్ క్రియేట్ చేశారు. 

 

PREV
click me!

Recommended Stories

1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు
Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?