పాక్ అభిమానికి రణవీర్ ఓదార్పు.. మీ క్రికెటర్స్ లో డెడికేషన్ ఉంది!

Published : Jun 18, 2019, 07:30 PM IST
పాక్ అభిమానికి రణవీర్ ఓదార్పు.. మీ క్రికెటర్స్ లో డెడికేషన్ ఉంది!

సారాంశం

ఆదివారం రోజు ముగిసిన ఇండియా, పాక్ ప్రపంచ కప్ మ్యాచ్ లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ మెరిశాడు. మైదానంలో సందడి చేస్తూ అభిమానులని ఉత్సాహపరిచారు. 

ఆదివారం రోజు ముగిసిన ఇండియా, పాక్ ప్రపంచ కప్ మ్యాచ్ లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ మెరిశాడు. మైదానంలో సందడి చేస్తూ అభిమానులని ఉత్సాహపరిచారు. క్రికెటర్స్ ని కూడా కలుసుకున్నాడు. రణవీర్ ఫోటోలు ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా పాక్ ని చిత్తుగా ఓడించింది. ప్రపంచకప్ లో పాక్ పై ఉన్న ఆధిపత్యాన్ని నిలుపుకుంది. 

పాక్ ఘోరపరాజయంలో ఆ దేశ అభిమానులు నిరాశ చెందారు. పాక్ ఓటమి తర్వాత మైదానంలో భాదపడుతూ కనిపించిన ఓ పాక్ అభిమానికి రణవీర్ సింగ్ దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. బాధపడకు.. మీ జట్టు మళ్లీ పుంజుకోవడానికి అవకాశం ఉంది అని తెలిపాడు. 

పాక్ జట్టు ఆటగాళ్లంతా కమిటెడ్ గా, డెడికేటెడ్ గా ఆడారు. వాళ్లలో ప్రయత్న లోపం లేదు అంటూ రణవీర్ సింగ్ పాక్ అభిమానికి ఓదార్చారు. అతడికి సెల్ఫీ కూడా ఇచ్చాడు. రణవీర్ మాటలకూ ఆ అభిమాని కృతజ్ఞతలు తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

PREV
click me!

Recommended Stories

Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి
Nayanam Review:తండ్రి వయసు వ్యక్తితో పెళ్లి, భర్తను చింపేసిన భార్య వరుణ్ సందేశ్ ‘నయనం’ ఎలా ఉంది?