
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అమలాపాల్ నటించారు . బెజవాడ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్ ఆ తర్వాత ఇద్దరమ్మాయిలతో, నాయక్ లాంటి చిత్రాల్లో నటించింది. 'ఆమె' లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా అమలాపాల్ నటించింది.
మొదట ఆమె దర్శకుడు ఏ.ఎల్. విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్నేళ్లకే విడిపోయారు. ఇప్పుడు జగత్ దేశాయ్ ని రెండో పెళ్లి చేసుకున్నారు. జగత్ దేశాయ్ తో ప్రేమ ఎలా మొదలైంది? పెళ్లికి ముందే గర్భం దాల్చడం వంటి విషయాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. "జగత్ దేశాయ్ ని కలిసిన ఒక నెలకే గర్భం దాల్చాను. మొదట గర్భం వచ్చాకే పెళ్లి చేసుకున్నాం" అని చెప్పారు.
"మా కొడుకు ఇలై మా జీవితంలోకి చాలా ఆనందం తెచ్చాడు. అతని కోసం మా అహాన్ని పక్కన పెట్టాం. ఇలై వచ్చాక మా ఇద్దరి మధ్య బంధం బలపడింది. అందుకే ఈ సంబంధాన్ని పవిత్రమైనది అంటున్నా. నా కొడుకు వచ్చాక నేను ఎంత ఓపిక ఉన్నదాన్నో తెలుసుకున్నా. నాకు ఓపిక అస్సలు ఉండేది కాదు. ఇప్పుడు నా అన్నయ్య కూడా నన్ను చూసి నువ్వు ఎలా ఇంత ఓపికగా మారిపోయావ్ అని ఆశ్చర్యపోతున్నాడు. అంతగా నా కొడుకు నన్ను మార్చేశాడు" అని చెప్పారు.