#మీటూ ఎఫెక్ట్: వింటా నందాపై పరువు నష్టం దావా!

Published : Oct 15, 2018, 04:23 PM IST
#మీటూ ఎఫెక్ట్: వింటా నందాపై పరువు నష్టం దావా!

సారాంశం

19 ఏళ్ల కిందట అలోక్ నాధ్ బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యం చేశాడని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది నిర్మాత, రచయిత వింటా నందా. దీంతో 'మీటూ' ఉద్యమం మరింత రాజుకుంది. తనపై అత్యాచార ఆరోపణలు రాగానే అలోక్ నాథ్ స్పందించారు. 

ఈ ఆరోపణలను ఖండించవచ్చు. అలాగే అంగీకరించవచ్చు. రేప్‌ కూడా జరిగి ఉండవచ్చు కానీ వేరేవాళ్లేవరో చేసి ఉండొచ్చు అంటూ చిత్ర విచిత్ర సమాధానాలతో తప్పించుకోవాలని ప్రయత్నించాడు. ఈ విషయంలో వింటా నందాకి మద్దతు తెలుపుతూ మరికొందరు నటీమణులు అలోక్ నాథ్ తమని లైంగికంగా వేధించారంటూ కొన్ని విషయాలను బయటపెట్టారు.

తనపై లైంగిక వేధింపులు, దాడి ఆరోపణలపై న్యాయపరమైన చర్యలకు నటుడుఅలోక్‌నాథ్‌ రంగం సిద్ధం చేసుకున్నారు. అత్యాచార ఆరోపణలు చేసిన రచయిత ప్రొడ్యూసర్‌ వింటా నందాపై పరువు నష్టం దావా కేసు వేశారు. 

అంధేరి కోర్టులో అలోక్‌నాథ్ భార్య ఆ దరఖాస్తును వేసింది. తన భర్తపై వచ్చిన తప్పుడు ఫిర్యాదులకు చర్యలు తీసుకోవాలని అంబోలీ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు.. 

లైంగిక ఆరోపణలతో అనారోగ్యం బారిన పడ్డ నటుడు!

‘‘రేప్ జరిగిందేమో.. కానీ నేను చేయలేదు’’

నాతో బలవతంగా మందు తాగించి రేప్ చేశాడు.. నటుడిపై ఆరోపణలు!

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?