Allu Sneha Reddy : అల్లు స్నేహారెడ్డి ‘పికాబు.. ఫైర్ ఫ్లై కార్నివాల్’.. ఈవెంట్ జరిగే ప్లేస్, డేట్..

Published : Jan 09, 2024, 04:10 PM IST
Allu Sneha Reddy :  అల్లు స్నేహారెడ్డి ‘పికాబు.. ఫైర్ ఫ్లై కార్నివాల్’.. ఈవెంట్ జరిగే ప్లేస్, డేట్..

సారాంశం

హైదరాబాద్ లో ఐకాన్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి త్వరలో ‘ఫైర్ ఫ్లై కార్నివాల్’ను నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన డిటేయిల్స్ ను తాజాగా వెల్లడించారు. 

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగా అల్లు స్నేహా రెడ్డి Allu Sneha Reddy అందరికీ పరిచయమే. భర్త పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటుంటూ.. స్నేహారెడ్డి కూడా పలు బిజినెస్ లు చూసుకుంటున్నారు. గతంలో స్నేహారెడ్డి ఆన్ లైన్ ఫొటో స్టూడియో ‘పికాబు’ Pic-a-booను స్థాపించారు. ఏడేళ్లుగా సంస్థను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఆ సంస్థ నుంచే ఓ ప్రకటన చేశారు. 

ఇక వ్యాపార రంగాల్లో ఎప్పుడూ ముందుండే అల్లు కుటుంబం నుంచి అల్లు స్నేహారెడ్డి స్థాపించిన పికాబు సంస్థ సమర్పిస్తున్న ఫైర్ ఫ్లై కార్నివాల్ ను (FireFly Carnival) నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఈనెల జనవరి 20న ఎన్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించనున్నారు. ఈ ఫ్యామిలీ కార్నివాల్ గ్రాండ్ చేయడం కోసం పికాబు సంస్థ టాప్ స్టిచ్ సంస్థతో జతకట్టింది. ఈ కార్నివాల్ లో షాపింగ్ ఎంజాయ్మెంట్ ఆక్టివిటీస్, రుచికరమైన వంటకాలు, లైవ్ మ్యూజిక్ తో ఆకట్టుకునే ఈవెంట్స్ ను కూడా ఏర్పాటు చేశారు. 

ఈ ఈవెంట్ ఈ నెల 20న మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ఉదయం 10 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు ఉంటుంది. ఈవెంట్ లో 100 స్టాల్స్, 30కి పైగా ఫుడ్ స్టాల్స్ ఉంటాయని తెలిపారు. ఐదుగురు ఆర్టిస్ట్ కూడా హాజరవుతున్నారని తెలిపారు. ఈవెంట్ కు వెళ్లాలనుకునే వారికి కోసం వెన్యూ వద్ద మరియు బుక్ మై షోలో టికెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?