అల్లు శిరీష్ 'ఎబిసిడి' ప్రీరిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా!

Published : May 11, 2019, 01:02 PM IST
అల్లు శిరీష్ 'ఎబిసిడి' ప్రీరిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా!

సారాంశం

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు శిరీష్ నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అల్లు శిరీష్ నటించిన చిత్రాల్లో శ్రీరస్తు శుభమస్తు మాత్రమే పరవాలేదనిపించింది. ప్రస్తుతం అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం ఎబిసిడి.

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు శిరీష్ నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అల్లు శిరీష్ నటించిన చిత్రాల్లో శ్రీరస్తు శుభమస్తు మాత్రమే పరవాలేదనిపించింది. ప్రస్తుతం అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం ఎబిసిడి. రాజీవ్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళీ చిత్రం ఎబిసిడికి ఇది రీమేక్. ఈ చిత్రంలో అల్లు శిరీష్ స్నేహితుడి పాత్రలో మాస్టర్ భరత్ నటిస్తున్నాడు. 

మే 17న ఎబిసిడి చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల వేగం పెంచుతోంది. మే 13న ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుక జరగనుంది. నేచురల్ స్టార్ నాని ఎబిసిడి ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నాడు. ఈ విషయాన్ని అల్లు శిరీష్ ట్విట్టర్ లో ప్రకటించాడు. 

ప్రీరిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యేందుకు అంగీకరించిన నేచురల్ స్టార్ నానికి మా ఎబిసిడి చిత్ర యూనిట్ తరుపున కృతజ్ఞతలు అని అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ కామెడీ యాంగిల్ ట్రై చేస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు శిరీష్, మాస్టర్ భరత్ కలసి బాగా అల్లరి చేసినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది. రుక్సార్ థిల్లోన్ శిరీష్ కు జంటగా నటించింది. 

PREV
click me!

Recommended Stories

Ram Charan కు ఏమయ్యింది? పెద్ది సక్సెస్ తరువాత కనిపించని మెగా పవర్ స్టార్.. ఎక్కడికెళ్లాడు?
Anasuya Bharadwaj: అనసూయ పోస్ట్ దుమారం, అసలు రంగు బయటపడింది.. అర్జున్‌ రెడ్డి టైమ్‌లో ఈ నీతులు ఏమయ్యాయి?