
బూతులేనిదే తెలుగు సినిమా ట్రైలర్ కు, టీజర్ కు కిక్ లేదన్నట్లు తయారైంది. జనాల్లో నానటానికి పచ్చి బూతుని ఒకదాన్ని ఇరికించి మరీ వదులుతున్నారు. జనం కూడా తిట్టుకుంటూనే ఆ తిట్లను బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు. దాంతో మరింతగా రెచ్చిపోతున్నారు. ఈ ట్రెండ్ ఎక్కడికి వెల్తుందో కాని ..తాజాగా దీన్ని ఫాలో అవుతూ యురేకా టైటిల్ తో రూపొందే ఓ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్‌లో కూడా ఓ సాలిడ్ బూతుపదం వాడారు.
ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘యురేక’.. కార్తీక్ ఆనంద్ దర్శకత్వం వహించారు.. లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకం పై ప్రశాంత్ తాత ఈ సినిమా ని నిర్మిస్తున్నారు. లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
లవ్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగా, టీజర్ చిత్రంపై ఆసక్తిని మరింత పెంచుతుంది. త్వరలో నే విడుదల తేదీని ప్రకటించనున్నారు..
కార్తీక్ ఆనంద్, షాలినీ,మున్నా, డింపుల్ హయతి , సమీక్ష, బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, తదితరులు నటిస్తొన్న చిత్రానికి దర్శకత్వం: కార్తీక్ ఆనంద్, నిర్మాత : ప్రశాంత్ తాత, సంగీతం: నరేష్ కుమరన్, డిఓపి: ఎన్.బి. విశ్వకాంత్, ఎడిటింగ్ : గ్యారీ బి.హెచ్, అనిల్ కుమార్.పి,