తీవ్రమైన పోటీలో వెనక్కి తగ్గని అల్లువారబ్బాయి.. సెన్సార్ కంప్లీట్!

Published : May 10, 2019, 06:56 PM IST
తీవ్రమైన పోటీలో వెనక్కి తగ్గని అల్లువారబ్బాయి.. సెన్సార్ కంప్లీట్!

సారాంశం

అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం ఎబిసిడి. సంజీవ్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం ఇది. మలయాళీ సూపర్ హిట్ చిత్రం ఎబిసిడికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది.

అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం ఎబిసిడి. సంజీవ్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ నటిస్తున్న చిత్రం ఇది. మలయాళీ సూపర్ హిట్ చిత్రం ఎబిసిడికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంపై అల్లు శిరీష్ ఆశలు పెట్టుకుని ఉన్నాడు. మే 17న ఎబిసిడి చిత్రం విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. 

తాజాగా ఎబిసిడి చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేశారు. సెన్సార్ సభ్యుల నుంచి ఎబిసిడికిమంచి రిపోర్ట్స్ వచ్చినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అల్లు శిరీష్ ఈ చిత్రంలో హాస్యభరితమైన పాత్రని ప్రయత్నించాడు. శిరీష్ కామెడీ టైమింగ్ బావుందంటూ ట్రైలర్ కు స్పందన వస్తోంది. 

ఇదిలా ఉండగా మే నెలలో వరుసగా చిత్రాలు విడుదలవుతున్నాయి. ఇప్పటికే మహర్షి చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన సీత చిత్రం మే 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. అర్జున్ సురవరం, ఎన్జీకే లాంటి చిత్రాలు కూడా ఇదే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అల్లు శిరీష్ ఎబిసిడి చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. 

తమ చిత్రంపై ఉన్న నమ్మకంతో ఎబిసిడి నిర్మాతలు మే 17న లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చాక థియేటర్స్ సంఖ్య పెంచాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రంలో రుక్సార్ థిల్లోన్ హీరోయిన్ గా నటిస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి