20 రోజులు నటించాక వదిలేశారు.. మహేష్ సినిమాలో ఆ పాత్ర చేసి ఉంటే!

Published : May 10, 2019, 05:26 PM IST
20 రోజులు నటించాక వదిలేశారు.. మహేష్ సినిమాలో ఆ పాత్ర చేసి ఉంటే!

సారాంశం

చక్రవాకం సీరియల్ ద్వారా ఇంద్రనీల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని చిత్రాల్లో కూడా నటించాడు. కానీ తన కెరీర్ ని మలుపు తిప్పే అవకాశాన్ని కోల్పోయానని ఇంద్రనీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

నటుడిగా రాణించాలని చాలా మంది ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కొందరికి అవకాశాలు రావడం ఆలస్యం కావచ్చు.. కానీ వచ్చిన ఛాన్స్ ని సద్వినియోగం చేసుకుని ఇండస్ట్రీలో ఎదిగిన నటులు చాలా మందే ఉన్నారు. మహిళలని విశేషంగా ఆకట్టుకున్న చక్రవాకం సీరియల్ ద్వారా ఇంద్రనీల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని చిత్రాల్లో కూడా నటించాడు. కానీ తన కెరీర్ ని మలుపు తిప్పే అవకాశాన్ని కోల్పోయానని ఇంద్రనీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 

ఇంద్రనీల్ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ మహేష్ నటించిన అతడు చిత్రంలో నెగిటివ్ రోల్ లో తనకు అవకాశం వచ్చిందని తెలిపాడు. అజయ్ నటించిన పాత్రలో మొదట నాకు అవకాశం వచ్చింది. 20 రోజులపాటు షూటింగ్ కూడా జరిగింది. కానీ ఆ సమయంలో చక్రవాకం సీరియల్ కారణంగా సరిగా అతడు చిత్రానికి సమయం కేటాయించలేదు. 

షూటింగ్ త్వరగా పూర్తి కావాల్సి ఉండడంతో చిత్రయూనిట్ నన్ను వదిలేసి అజయ్ ని ఎంపిక చేసుకుని అని ఇంద్రనీల్ తెలిపాడు. ఆ తర్వాత అంత మంచి అవకాశంమళ్ళీ రాలేదు. అతడు చిత్రంలో నటించి ఉంటే టాలీవుడ్ లో విలన్ గా మంచి అవకాశాలు వచ్చి ఉండేవి అని ఇంద్రనీల్ గుర్తుచేసుకున్నాడు.  

టాలీవుడ్ లో నటుడిగా ఎదిగే అవకాశం ఇప్పటికీ ఉంది. అందుకే ప్రస్తుతం ఎక్కువగా సినిమాపై దృష్టి పెడుతున్నట్లు ఇంద్రనీల్ వెల్లడించాడు. మళ్ళీ అతడు లాంటి అవకాశం ఇంద్రనీల్ కు ఎప్పుడు వస్తుందో మరి!

PREV
click me!

Recommended Stories

VAS vs Makutam Box Office: సూర్య సెంచరీ.. క్లీన్ బౌల్డ్ అయిన విశాల్! కలెక్షన్లలో ఎవరు టాప్?
KoKa 10 Days Collections: వరుణ్‌ తేజ్‌ మూవీకి రెండో వారంలో అదిరిపోయే కలెక్షన్లు.. కొరియన్‌ కనకరాజు ఎంత రాబట్టిందంటే?