అను ఇమ్మాన్యుయెల్‌తో రిలేషన్‌.. తమది `ప్రేమ కాదంటు`న్న అల్లు శిరీష్‌

Published : May 30, 2021, 11:24 AM IST
అను ఇమ్మాన్యుయెల్‌తో రిలేషన్‌.. తమది `ప్రేమ కాదంటు`న్న అల్లు శిరీష్‌

సారాంశం

 ఇప్పుడు రెండు ఫస్ట్ లుక్‌లతో వచ్చాడు. అదే సమయంలో చిత్ర టైటిల్‌ని ప్రకటించారు. ఇందులో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయెల్‌తో ఇంటెన్స్‌, రొమాంటిక్‌ లుక్‌లో ఉన్నాడు శిరీష్‌. తమ రిలేషన్‌ ప్రేమ కాదంటున్నారు. 

అల్లు హీరో శిరీష్‌ రొమాన్స్ లో తగ్గేదెలే అంటున్నాడు. కొత్త సినిమాకి సంబంధించి వరుసగా ప్రీ లుక్‌లతో అదరగొడుతున్నారు. ఇటీవల రొమాంటిక్‌ లుక్‌ని పంచుకుని షాక్‌ ఇచ్చిన శిరీష్‌ రెండో ప్రీలుక్‌తో రెచ్చిపోయాడు. మరింత ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడు.  ప్రీ లుక్స్ వైరల్‌గా మారాయి. ఇప్పుడు రెండు ఫస్ట్ లుక్‌లతో వచ్చాడు. అదే సమయంలో చిత్ర టైటిల్‌ని ప్రకటించారు. ఇందులో హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయెల్‌తో ఇంటెన్స్‌, రొమాంటిక్‌ లుక్‌లో ఉన్నాడు శిరీష్‌. తమ రిలేషన్‌ ప్రేమ కాదంటున్నారు. 

అల్లుశిరీష్‌ బర్త్ డేని పురస్కరించుకుని విడుదల చేసిన తాజా ఫస్ట్ లుక్‌లు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఆకట్టుకుంటున్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాకి రాకేష్‌ శశి దర్శకత్వం వహిస్తున్నారు. `కొత్త జంట`‌, `శీర‌స్తు శుభ‌స్తు`, `ఏబిసిడి` వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో `ఒక్క క్ష‌ణం` వంటి వినూత‌న్న‌మైన సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన‌ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అల్లు శిరీష్, 

మెగాప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో `100% ల‌వ్`, `భలే భ‌లే మ‌గాడివోయ్`, `గీత‌గోవిందం`, `ప్ర‌తిరోజూపండుగే` వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా మారిన నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ మీద ఈ సినిమా సిద్ధ‌మైంది. మే30 అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఉద‌యం 11 గంట‌ల‌కు అల్లు శిరీష్ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్