Pushpa 2 : షూటింగ్ అప్డేట్.. పుష్పరాజ్ పార్టీ ఇస్తున్నాడు.. ఎక్కడంటే?

By Asianet News  |  First Published Jul 1, 2023, 10:01 AM IST

గతేడాది మొత్తం ‘పుష్పరాజ్’ మేనియా నడిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీక్వెల్  శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ అందింది. ఇంట్రెస్టింగ్ న్యూస్ అందింది.
 


ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ (Allu Arjun) - త్రివిక్రమ్ కాంబోలో ‘పుష్ప : ది రైజ్’ వచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మించారు. Pushpa The Rise 2021 డిసెంబర్ 14న విడుదలై దేశ వ్యాప్తంగా సెన్సేషన్ గా మారింది. చిత్రంలో పుష్పరాజ్ మేనరిజం ప్రపంచ వ్యాప్తంగా పాకిన విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు, క్రికెటర్స్ కూడా పుష్పరాజ్ స్టైల్ ను ఫాలోవడంతో మరింత క్రేజ్ పెరిగింది. మరోవైపు దీనికి సీక్వెల్ కూడా ప్రకటించడంతో ప్రస్తుతం భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. మారేడుమిల్లి, వైజాగ్, తదితర ప్రాంతాల్లో యాక్షన్ సీన్లను చిత్రీకరించారు. సీక్వెల్ లో యాక్షన్ అదిరిపోనుందని తెలుస్తోంది. అయితే తాజాగా షూటింగ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఓ రిసార్ట్ లో జరుగుతుందని తెలుస్తోంది. ఈ సాంగ్ పుష్పరాజ్ పార్టీ నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. అయితే ఫస్ట్ పార్ట్ లో మంగళం శ్రీను పార్టీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు సమంత స్పెషల్ అపియరెన్స్ తో అదరగొట్టింది. ‘ఊ అంటావా మావా’ సాంగ్ సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే.

Latest Videos

ఈ సాంగ్ లో అల్లు అర్జున్, రష్మిక మందన్న (Rashmika Mandanna)  కూడా ఉన్నారని అంటున్నారు. మరీ స్పెషల్ అపియరెన్స్ గా ఎవరు ఉన్నారనేది సస్పెన్స్ గానే ఉంది. ప్రస్తుతం పార్టీ సెట్ లో షూటింగ్ జరుగుతుంది. దీంతో పుష్పరాజ్ పార్టీ గ్రాండ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఫ్యాన్స్ అందరికీ అందిరిపోయే పార్టీ పక్కాగా ఉండనుందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. బన్నీ బర్త్ డే కు విడుదలైన Where is Pushpa గ్లింప్స్  ఇండియా మొత్తం ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. 

ఇక మున్ముందు రాబోయే అప్డేట్స్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సీక్వెల్ లో సుకుమార్ ప్రతి అంశాన్ని మరింత గ్రాండ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. యాక్షన్, క్లైమాక్స్, ట్విస్టులు, సాంగ్స్ కు సంబంధించి మరింత మంచి ఎక్స్ పీరియెన్స్ ను అందించేలా చూస్తున్నారంట. ఇక సీక్వెల్ లో మరికొంత మంది నటీనటులు కూడా అలరించబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మున్ముందు అప్డేట్ అందనున్నాయి. అనసూయ, ఫహద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏఢాది విడుదల కానుంది. 

click me!