అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ కి ఆఫర్ ఇచ్చిన బ‌న్ని

Published : Aug 29, 2017, 07:22 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ కి ఆఫర్ ఇచ్చిన బ‌న్ని

సారాంశం

ఇప్పుడు టాలీవుడ్ లో మార్మోగుతున్న డైరెక్ట‌ర్ పేరు సందీప్ వంగా  త‌న మొద‌టి సినిమా అర్జున్ రెడ్డి లో త‌న టాలెంట్ ఎంటో చూపించాడు అర్జున్ రెడ్డి మూవీని స్పెష‌ల్ స్కీనింగ్ వేయించుకుని చూసిన అల్లు అర్జున్ 

సందీప్ వంగా.ఇప్పుడీ దర్శకుడి పేరు టాలీవుడ్ లో మార్మోగిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. అర్జున్ రెడ్డి అంటూ కేవలం ఒక్క సినిమాతోనే తన స్టైల్ ఆఫ్ మేకింగ్ ఏంటో చూపించేశాడు. అంతే కాదు.. ప్రొడ్యూసర్స్.. బయ్యర్స్.. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ తొలి వీకెండ్ ముగిసేలోపే లాభాలు కళ్లచూశారంటే.. అది కచ్చితంగా సెన్సేషనల్ విక్టరీనే. 

 

ఇంతటి ఘన విజయాన్ని సాధించిన దర్శకుడికి.. పెద్ద హీరోల నుంచి అభినందనలు రావడంలో ఆశ్చర్యం లేదు. అయితే.. మిగతావారి కాల్స్ కు.. అల్లు అర్జున్ ప్రశంసలకు కాసింత తేడా ఉంటుంది. రీసెంట్ గా అర్జున్ రెడ్డిని స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకుని మరీ చూసిన స్టైలిష్ స్టార్.. మూవీ కంటెంట్.. మేకింగ్ చూసి మెస్మరైజ్ అయ్యాడట.

 

 అంతే కాదు. వెంటనే దర్శకుడు సందీప్ ను పిలిపించి అభినందించాడట కూడా. అంతే కాదు.. తనకు తగిన మంచి స్క్రిప్ట్ తో వస్తే సినిమా చేద్దామని కూడా చెప్పాడట బన్నీ. గతంలో హరీష్ శంకర్ కు ఇలాగే కాల్ ద్వారా పిలుపు అందుకుని.. ఆ తర్వాత డీజే-దువ్వాడ జగన్నాధం తెరకెక్కించాడు. 

 

తర్వాత వక్కంతం వంశీకి కూడా ఇలాగే ఛాన్స్ రాగా.. ప్రస్తుతం బన్నీ నటిస్తున్న నా పేరు సూర్య రూపొందుతోంది. ఇప్పుడు అర్జున్ రెడ్డి మూవీలో స్టార్ హీరో ఎవరైనా నటిస్తే.. అది అల్లు అర్జున్ కి మాత్రమే సరిపోతుందని ముందే చెప్పిన సందీప్ వంగా.. నేరుగానే బన్నీ నుంచే పిలుపు అందుకోవడం విశేషం. 

 

మరెన్నో తాజా వార్తల కోసం క్లిక్ చేయండి https://goo.gl/UR95BM

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : దీప కు చెక్ పెట్టడానికి జ్యోత్స్న మాస్టర్ ప్లాన్, శ్రీధర్ బెయిల్ విషయంలో కార్తీక్ కు పోలీసుల షాక్
OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్