అప్పుడే వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వార్త..స్పెషలే

Published : Aug 28, 2017, 08:20 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
అప్పుడే వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వార్త..స్పెషలే

సారాంశం

పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కోసం ఫ్యాన్ మేడ్ డీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రం అల్లు శిరీష్ కూడా ట్వీట్ చేసిన పీకే పిక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాక ఇటు సినిమా సర్కిల్స్ లోనే కాక పొలిటికల్ సర్కిల్స్ లోనూ తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకున్నారు. తనదైన వ్యక్తిత్వంతో సినీపరిశ్రమలోని అందరినీ తన అభిమానులుగా మార్చుకున్న పవన్ కళ్యాణ్ కు హీరోలు, దర్శకుల్లో కూడా అభిమానులున్నారు. తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ వున్న హీరో నితిన్ లాంటి వాళ్లు కూడా... పవన్ కల్యాణ్ ను ఏ రేంజ్ లో అభిమానిస్తారో తెలిసిందే. నిర్మాత బండ్ల గణేశ్ లాంటి వాళ్లయితే దేవుడిలా కొలుస్తారు పవన్ కళ్యాణ్ ను.

 

అందుకే రాజకీయంగా జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కు పొలిటికల్ గా కూడా ఎంతో రెస్పాన్స్ వస్తోంది. ప్రజలకు సేవ చేయాలనే తత్వం వున్న పవన్ కళ్యాణ్.. ఆ లక్షణం కారణంగానే లక్షలాది మందిలో ఫాలోయింద్ సంపాదించారు. తను బహిరంగ సభలు నిర్వహించినా.. ఏదైనా పిలుపునిచ్చినా జనం స్పందించే తీరు చూస్తేనే పవన్ క్రేజ్ ఏంటో అర్థమవుతుంది.

 

పవన్ పై అభిమానంతో ఓ అభిమాని పవన్ కళ్యాణ్ కు సంబంధించిన వివిధ ఎమోషన్స్ తో, పలు సినిమాల్లోని ఫోటోలే కాక సహజంగా తీసిన ఫోటోలను కలిపి...ఓ డీపీ తయారుచేశాడు. ఆ ఫోటో నచ్చిన పవన్ కళ్యాణ్ దాన్ని జనసేన పార్టీ అఫీషియల్ వెబ్ సైట్ లో కూడా పెట్టించేందుకు అంగీకరించారట. మొత్తానికి పవన్ కళ్యాణ్ లోని వివిధ ఎమోషన్స్ కలగలిపి రూపొందించిన ఆ డీపీ మాత్రం అద్భుతంగా వుండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని అల్లు శిరీష్ కూడా ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా
Bigg Boss Telugu Winners : టైటిల్ గెలిచారు కానీ.. ఉపయోగం లేదు, బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?