సాయిధరమ్‌తేజ్‌ని పరామర్శించిన అల్లు అర్జున్‌.. ఫోటోలు వైరల్‌

Published : Sep 16, 2021, 06:50 PM IST
సాయిధరమ్‌తేజ్‌ని పరామర్శించిన అల్లు అర్జున్‌.. ఫోటోలు వైరల్‌

సారాంశం

సాయితేజ్‌ ఆరోగ్య పరిస్థితిని  వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్‌ వస్తున్నారని తెలిసి భారీగా అభిమానులు ఆసుపత్రికి తరలి వచ్చారు. 

హీరో సాయిధరమ్‌తేజ్‌ని ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పరామర్శించారు. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో సాయిధరమ్‌ తేజ్‌ చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో గురువారం ఆయన ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. సాయితేజ్‌ ఆరోగ్య పరిస్థితిని  వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్‌ వస్తున్నారని తెలిసి భారీగా అభిమానులు ఆసుపత్రికి తరలి వచ్చారు. 

అల్లు అర్జున్‌.. సాయిధరమ్‌తేజ్‌కి యాక్సిడెంట్‌ జరిగినప్పుడు కాకినాడ షూటింగ్‌లో ఉన్నారు. అక్కడ `పుష్ప` చిత్రీకరణ జరుగుతుంది. బిజీ షెడ్యూల్‌ కారణంగా ఆయన సాయిధరమ్‌ తేజ్‌ని పరామర్శించలేకపోయారు. ఇప్పుడు గ్యాప్‌ దొరకడంతో హైదరాబాద్‌ వచ్చి నేరుగా సాయిధరమ్‌ తేజ్‌ని పరామర్శించేందుకు వెళ్లారు. ఇదిలా ఉంటే సాయిధరమ్‌ తేజ్‌ గత శుక్రవారం ఐకియా రోడ్డులో బైక్‌పై యాక్సిడెంట్‌కి గురైన విషయం తెలిసిందే. 

ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సాయితేజ్‌ క్రమంగా కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతున్న నేపథ్యంలో జగపతిబాబు కూడా ట్వీట్‌ చేశారు. సాయితేజ్‌ కోలుకుంటున్నందుకు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సాయిధరమ్‌ తేజ్‌ నటించిన `రిపబ్లిక్‌` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దేవా కట్టా దీనికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు