''ఏంట్రా బలిసిందా..?'' అఖిల్ పై ఎన్టీఆర్ కామెంట్!

Published : Jan 20, 2019, 12:11 PM ISTUpdated : Jan 20, 2019, 12:18 PM IST
''ఏంట్రా బలిసిందా..?'' అఖిల్ పై ఎన్టీఆర్ కామెంట్!

సారాంశం

అక్కినేని అఖిల్.. ఎన్టీఆర్ ని గారు అని పిలిస్తే దానికి ఎన్టీఆర్ 'ఏంట్రా బలిసిందా..?' అని అడుగుతాడట. ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా వెల్లడించాడు. 

అక్కినేని అఖిల్.. ఎన్టీఆర్ ని గారు అని పిలిస్తే దానికి ఎన్టీఆర్ 'ఏంట్రా బలిసిందా..?' అని అడుగుతాడట. ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా వెల్లడించాడు. అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు తారక్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

సినిమా గురించి స్టేజ్ పై మాట్లాడే సమయంలో అఖిల్.. తారక్ గురించి కూడా గొప్పగా మాట్లాడాడు. తారక్ ని టైగర్ అని పిలుస్తుంటానని.. నిజంగా ఆయన టైగరే అని ఆయన ఎనర్జీని ఎవరూ బీట్ చేయలేరని అన్నాడు. తారక్ గారు అంటే అసలు తట్టుకోలేడని..  'ఏంట్రా బలిసిందా..?' అని అంటాడని అఖిల్ చెప్పుకొచ్చాడు. 

''ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడానికి అంగీకరించినందుకు థాంక్స్ అని తారక్ కి అన్నకి మెసేజ్ పెట్టగా.. దానికి ఇంత ఫార్మల్ గా ఉండకు. ఇది నా బాధ్యత. నీ మీద ఉన్న ప్రేమతో చేస్తున్నానని అన్నారు. నన్ను తన ఫ్యామిలీ మెంబర్ లా చూస్తాడు'' అంటూ తారక్ తో తనకున్న అనుబంధం గురించి చెప్పాడు అఖిల్.

వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. జనవరి 25న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

 

PREV
click me!

Recommended Stories

Rashmika Mandanna: పెళ్లైన నెలకే ‘ముగ్గురం’ అయ్యాం.. రష్మిక పోస్ట్ వైరల్, ఫ్యాన్స్ క్రేజీ రియాక్షన్
Biker Review: బైకర్‌ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్‌, రాజశేఖర్‌ మూవీలో హైలైట్స్ ఇవే.. అదొక్కటే మైనస్‌