పవన్ ఫ్యాన్స్ కు బన్నీ థాంక్స్ చెప్పేశాడు

Published : Mar 21, 2017, 01:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
పవన్ ఫ్యాన్స్ కు బన్నీ థాంక్స్ చెప్పేశాడు

సారాంశం

డీజే దువ్వాడ జగన్నాథమ్ మూవీ టీజర్ కు 10 మిలియన్ వ్యూస్ చూసిన వారందరికీ థాంక్స్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కూాడా కలిపే థాంక్స్ చెప్పాడంటున్న బన్నీ టీమ్

మెగా హీరోల్లో అల్లు అర్జున్ ఇటీవల వరుస బ్లాక్ బస్టర్స్ తో మాంచి జోష్ మీదున్నాడు. తాజాగా ఆయన నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక అల్లు అర్జున్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మా చెడ్డ అది. అదేంటోగానీ డీజే టీజర్ ను చూసీ చూసీ డిస్ లైక్స్ కొట్టీ కొట్టీ పవర్ స్టార్స్ ఫ్సాన్య్ తమ కసి తీర్చుకునే ప్రయత్నం చేశారు.

 

అయితే వరుస హిట్లతో ఊపు మీదున్న అల్లు అర్జున్ డీజే టీజర్ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సంపాదించిన లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడీ టీజర్ వ్యూస్ కోటి దాటిపోయి రికార్డ్ సృష్టించేసింది. ఈ సందర్భంగా బన్నీ స్పెషల్ ట్వీట్ పెట్టాడు. 'కోటి వ్యూస్ అందించిన ప్రతీ ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తెలుగు సినిమాల్లో అత్యధిక వ్యూస్ ఇచ్చారు. మీ అందరి ప్రీమకు మరోసారి థ్యాంక్యూ' అంటూ ట్వీట్ చేశాడు బన్నీ.

 

ఈ టీజర్ కు ఇన్ని వ్యూస్ దక్కడంలో పవన్ ఫ్యాన్స్ పని కట్టుకుని మరీ డిజ్ లైక్స్ కొట్టేందుకు చూసిన వ్యూస్ కూడా కౌంట్ అయ్యాయి. అందుకే డీజే టీజర్ కు లైక్స్ 1.78 లక్షలు ఉంటే.. డిజ్ లైక్స్ 1.63 లక్షల వరకు వచ్చాయి. డిజ్ లైక్ కొట్టడానికి చూసినా.. పవన్ ఫ్యాన్స్ డీజే టీజర్ ను చూశారు. అందుకే ఇప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పడం అంటే అందులో.. పవన్ ఫ్యాన్స్ ని కూడా బన్నీ కలిపే థాంక్స్ చెప్పాడని అర్థం చేసుకోవాలంటున్నారు బన్నీ సైడ్ ఫ్యాన్స్. మరోవైపు.. ఇప్పటికే 85శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న దువ్వాడ జగన్నాధం సినిమాను మే 19న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.తచ

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్