కాజల్ తంతే ఎక్కడపడిందో తెలుసా

Published : Mar 21, 2017, 01:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
కాజల్ తంతే ఎక్కడపడిందో తెలుసా

సారాంశం

పూరీ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ బంపర్ హిట్ బాలీవుడ్ లో తెరకెక్కనున్న టెంపర్ టెంపర్ బాలీవుడ్ వెర్షన్ లో రణ్ వీర్ సింగ్ సరసన కూడా కాజల్

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ సినిమా ఏ రేంజ్ లో హిట్టయిందో తెలిసిందే. ఈ మూవీ ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి దీన్ని రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ ను హీరోగా అనుకున్నారు. టెంపర్‌లో కాజల్ ఫెర్ఫార్మెన్స్ నచ్చి హిందీలో కూడా నటించాలని కోరారట. కాజల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

 

టాలీవుడ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకొన్న టెంపర్ చిత్రం తమిళంలో కూడా రీమేక్ అవుతోంది. ఈ చిత్రంలో విశాల్ హీరోగా నటిస్తున్నాడు. తమిళ వెర్షన్ లోనూ విశాల్ సరసన కాజల్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో రూపొందించే చిత్రంలో నటించే అవకాశం లభించడంపై కాజల్ యమా హ్యాపీగా ఉంది. ప్రస్థుతం బాలీవుడ్‌లో రెండు సినిమా అవకాశాలు ఉన్నాయంటున్న కాజల్ వాటిలో టెంపర్ మాత్రం లేదంటోంది.

 

టెంపర్ కు సంబంధించి ఆఫర్ గురించి ఏమీ చెప్పకున్నా... రణ్ వీర్ తో చేయడమంటే నాకు చాలా ఇష్టమని కాజల్ అంటోంది. అంతేకాక రోహిత్ శెట్టి డైరెక్షన్‌లో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని కాజల్ చెప్పింది. 2004లో క్యో హో గయా నా అనే చిత్రం ద్వారా కాజల్ బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. చిరంజీవి, పవన్ కల్యాణ్, రాంచరణ్, ప్రభాస్ లాంటి అగ్రహీరోల సరసన నటించిన కాజల్ టాప్ గేర్ లో దూసుకెళ్తూ... ఇప్పుడు బాలీవుడ్ నూ మళ్లీ ఓ సూపు సూద్దామని ఫిక్స్ అయింది. మొత్తానికి కాజల్ తంతే బూరెల బుట్టలో పడిందన్నమాట.

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్