
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే `సైమా`(సౌత్ ఇండియన్ ఇంటర్నేషన్ మూవీ అవార్డ్స్) అవార్డులు శనివారం, ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన తారలు సందడి చేశారు. తారాలోకం దిగి రావడంతో హైదరాబాద్ తళుక్కున మెరిసింది. కనువిందుగా మారింది. సైమా వేడుకకి హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికైంది.
కరోనా కారణంగా వాయిదా పడిన 2019, 2020 ఏడాదులకు సంబంధించిన అవార్డులను ఈ సారి ప్రధానం చేశారు. ఇందులో అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రం అత్యధిక అవార్డులను దక్కించుకుంది. ఏకంగా ఇది పది పురస్కారాలను సొంతం చేసుకోవడం విశేషం. 2019 విన్నర్స్‌కి శనివారం అవార్డులు అందించారు. ఆదివారం 2020లో గెలుపొందిన విన్నర్స్‌కు అవార్డులు అందించారు. 2020 సంవత్సరానికిగానూ విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
2020కిగానూ `అల వైకుంఠపురములో` చిత్రం ఏకంగా పది అవార్డులను సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఇందులో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్, ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా పూజా హెగ్డే, ఉత్తమ సహాయ నటుడు మురళీ శర్మ, ఉత్తమ సహాయ నటి టబు, ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్‌ఎస్ థమన్, ఉత్తమ పాట రచయితగా రామజోగయ్య శాస్త్రి(బుట్ట బొమ్మ), ఉత్తమ గాయకుడిగా అర్మాన్ మాలిక్(బుట్టబొమ్మ), ఉత్తమ విలన్‌గా సముద్రఖని `అల వైకుంఠపురములో` చిత్రానికి సైమా అవార్డు లను అందుకున్నారు.
`అల వైకుంఠపురములో` చిత్రానికి పోటీగా విడుదలైన మహేష్‌బాబు `సరిలేరు నీకెవ్వరు` కేవలం రెండు అవార్డులనే దక్కించుకుంది. `ఉత్తమ గాయని`గా మధుప్రియ(హి ఈజ్ సో క్యూట్), ఉత్తమ సినిమాటోగ్రఫీగా ఆర్ రత్నవేలు అవార్డులను సొంతం చేసుకున్నారు. బన్నీ చిత్రంతో పోల్చితే తక్కువ అవార్డులు రావడం మహేష్‌కి మైండ్ బ్లాంక్ అయ్యిందని బన్నీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
`సైమా` 2020 అవార్డుల జాబితా చూస్తే..
ఉత్తమ చిత్రం: అల వైకుంఠపురములో (హారిక అండ్ హాసిని క్రియేషన్స్ & గీతా ఆర్ట్స్)
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): సుధీర్‌బాబు (వి)
ఉత్తమ నటి: పూజా హెగ్డే (అల వైకుంఠపురములో)
ఉత్తమ నటి (క్రిటిక్స్): ఐశ్వర్య రాజేష్ (వరల్డ్ ఫేమస్ లవర్)
ఉత్తమ దర్శకుడు: త్రివిక్రమ్ శ్రీనివాస్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సహాయ నటుడు: మురళీ శర్మ (అల వైకుంఠపురములో)
ఉత్తమ సహాయ నటి: టబు (అల వైకుంఠపురములో)
ఉత్తమ సంగీత దర్శకుడు: ఎస్.ఎస్. థమన్ (అల వైకుంఠపురములో)
ఉత్తమ గేయ రచయిత: రామజోగయ్య శాస్త్రి(బుట్టబొమ్మ.. అల వైకుంఠపురములో)
ఉత్తమ గాయకుడు: అర్మాన్ మాలిక్(బుట్టబొమ్మ.. అల వైకుంఠపురములో)
ఉత్తమ గాయని: మధుప్రియ (హి ఈజ్ సో క్యూట్-సరిలేరు నీకెవ్వరు)
ఉత్తమ విలన్: సముద్రఖని (అల వైకుంఠపురములో)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: ఆర్. రత్నవేలు (సరిలేరు నీకెవ్వరు)
ఉత్తమ కమెడియన్: వెన్నెల కిషోర్ (భీష్మ)
ఉత్తమ తొలి పరిచయ హీరో: శివ కందుకూరి (చూసి చూడంగానే..)
ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: రూప కొడువయూర్ (ఉమామహేశ్వర ఉగ్రరూపస్య)
ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: కరుణ కుమార్ (పలాస 1978)
ఉత్తమ తొలి పరిచయ నిర్మాత: అమృత ప్రొడక్షన్స్ అండ్ లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ (కలర్‌ఫొటో)