
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ రోజు రోజుకు షాక్ ల మీద షాకులిస్తున్నాడు. తండ్రిని మించిన తనయుడు అని ఫ్యాన్స్ తో అనిపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. బన్నీని మించి యాక్టీవ్ గా ఉండే ఈ స్టార్ కిడ్ ఇప్పటికే బాగాఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం తన తండ్రి కంటే ఎక్కువుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఈ అల్లు వారసుడు చేసే అల్లరికి ఫ్యాన్స్ తో పాటు నెటిజెన్స్ అంతా ఫిదా అవుతూనే ఉన్నారు.
అంతే కాదు ఫ్యూచర్ స్టార్ అంటూ ప్రచారం చేయడంతో పాటు.. మోడల్ అయాన్ అంటూ అల్లు వారసుడిని సోషల్ మీడియా సెలబ్రిటీని చేసేసారు. దీంతో ప్రస్తుతం అయాన్ వైరల్ అవుతున్నాడు. అతను చేసే ప్రతీ పని నెట్టింట వైరల్ అవుతోంది. బన్నీ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇక మెగా, అల్లు వారి వారసుడిగా బన్నీ ఎలాగైతే హీరోగా ఎదిగాడో.. అయాన్ కూడా అల్లు అర్జున్ వారసుడిగా ఫ్యూచర్ లో హీరోగా రావడం ఖాయం అని తెలుస్తోంది.
దాని కోసం ఇప్పటినుంచే అయాన్ ను ప్రిపేర్ చేస్తున్నాడు బన్నీ. తాజాగా అల్లు స్నేహారెడ్డి అయాన్ కి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిని స్నేహ తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు.ఆ వీడియోలో అయాన్ జిమ్ లో వర్క్ అవుట్ లు చేస్తూ కనిపిస్తున్నాడు. ట్రైనర్ తో బాక్సింగ్ చేస్తూ, తన తల్లితో కలిసి భారీ టైర్ ని లిఫ్ట్ చేస్తూ.. ఇప్పటినుంచే కండలు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.
అంతేకాదు, జెంటిల్‌మెన్ లా న్యూస్ పేపర్ కూడా చదువుతూ.. డీసెంట్ గా ఉన్న ఫోటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఇవన్నీ చూసిన బన్నీ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. మోడల్ అయాన్ కాదు హీరో అయాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చాడయ్యో సామి అంటూ పండగచేసుకుంటున్నారు. అటు బన్నీ పాన్ ఇండియాను శేక్ చేయడానికి రెడీ అవుతుంటే.. ఇటు అయాన్ టాలీవుడ్ ను ఆకర్షించే పనిలో పడ్డాడు.
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. పుష్ప 2 ను అంతకుమించి తెరకెక్కించే పనిలో ఉన్నారు. 1000 కోట్ల కలెక్షన్ మార్క్ దాటడంతో పాటు... ఆస్కార్ కు ఈసినిమాను ఎలాగైనా తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్. ఇప్పటికే ఫస్ట్ పార్టుకి ప్రపంచ వ్యాప్తంగా ఓ రేంజ్ క్రేజ్ రావడంతో తోపాటు.. బన్నీకి జాతీయ అవార్డ్ కూడా వచ్చింది. ఇక సీక్వెల్ ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తుండగా.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈమూవీ మొత్తం మూడు భాగాలుగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.