నీకు నేను నేర్పిస్తా సామ్: బన్నీ

Published : Aug 15, 2018, 04:20 PM ISTUpdated : Sep 09, 2018, 01:35 PM IST
నీకు నేను నేర్పిస్తా సామ్: బన్నీ

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అల్లు అర్జున్ మాదిరి డాన్స్ చేయడానికి ప్రయత్నించి విఫలమైందట. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. అసలు విషయంలోకి వస్తే.. 'అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' సినిమాలో లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అనే పాటలో బన్నీ క్యాప్ పెట్టుకొని కొన్ని ట్రిక్స్ తో డాన్స్ చేశాడు. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అల్లు అర్జున్ మాదిరి డాన్స్ చేయడానికి ప్రయత్నించి విఫలమైందట. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. అసలు విషయంలోకి వస్తే.. 'అల్లు అర్జున్ నటించిన 'నా పేరు సూర్య' సినిమాలో లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అనే పాటలో బన్నీ క్యాప్ పెట్టుకొని కొన్ని ట్రిక్స్ తో డాన్స్ చేశాడు. ఎలాంటి ఎఫెక్ట్స్ ఉపయోగించకుండా బన్నీ ఈ డాన్స్ చేశాడు.

దానికోసం ఎంతగా కష్టపడ్డాడో సినిమా రిలీజ్ సమయంలో చిత్రబృందం కూడా చెప్పింది. అయితే ఈ పాటకు బన్నీ స్టైల్ లో డాన్స్ చేయడానికి ట్రై చేసిందట సామ్. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..  'ఈ పాట ట్రై చేయకుండా ఉండలేకపోయాను. మూడు గంటల పాటు నేను క్యాప్‌తో ప్రాక్టీస్ చేశాను. అల్లు అర్జున్ హార్డ్ వర్క్ చేయడంలో హీరో' అని ట్వీట్ చేసింది సామ్.

దీనికి బన్నీ.. 'థాంక్యూ సామ్. ఇప్పుడే నీ ట్వీట్‌ని చూశాను. కొన్ని ట్రిక్స్ నేర్పించడానికి నాకేం అభ్యంతరం లేదు. ఎవరైనా నేర్పిస్తే చాలా ఈజీ అవుతుంది' అని చెప్పాడు. దానికి సామ్ సరే అన్నట్లుగా ఆయనకు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం సమంత 'యుటర్న్' సినిమాలో నటిస్తోంది. ఇక అల్లు అర్జున్ మాత్రం 'నా పేరు సూర్య' తరువాత ఇప్పటివరకు తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. 

 

 

PREV
click me!

Recommended Stories

భగవంతుడా ఒక్క ఫ్లాప్ ఇవ్వు అని వేడుకున్న చిరంజీవి డైరెక్టర్ ఎవరో తెలుసా? వరుసగా 16 సక్సెస్ లు తట్టుకోలేకపోయాడా?
Gunde Ninda Gudi Gantalu Today ఎపిసోడ్ డిసెంబర్ 16 బాలుని సవతి తల్లిలా చూశాను... ప్రభావతిలో మొదలైన పశ్ఛాత్తాపం