గద్దర్ అవార్డు పై స్పందించిన అల్లు అర్జున్, వారికి అంకితం చేసిన ఐకాన్ స్టార్

Published : May 29, 2025, 07:55 PM IST
 allu arjun next film AA22xA6

సారాంశం

గద్దర్ అవార్డు ల ప్రకటనతో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ కొత్త శకం మొదలయ్యింది. ఈక్రమంలో ఈ అవార్డ్స్ సాధించిన వారు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఈ అవార్డు లపై సోషల్ మీడియాలో స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. అందులో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను అందుకోబోతున్నారు. తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో భాగంగా, “పుష్ప 2: ది రూల్” చిత్రానికి గాను ఆయన ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తనకు గద్దర్ అవార్డును ప్రకటించడంపై అల్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియా వేదికపై స్పందించారు.

ఈ గౌరవం అందుకోవడం తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోందని అల్లు అర్జున్ అన్నారు. " పుష్ప సినిమాకుగాను ఉత్తమ నటుడి అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నాను, ఈ అవార్డును ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఇది తాను ఒక్కడిగా సాధించలేనని, ఈ అవార్డుకు పాత్రులైన వారు ఎంతోమంది ఉన్నారని అల్లు అర్జున్ స్పష్టం చేశారు. ఈ క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్ నా నిర్మాతలకు, మొత్తం పుష్ప బృందానికి చెందుతుంది అని ఆయన వెల్లడించారు. సినిమా విజయం కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

అంతే కాదు ఈ అవార్డు తన అభిమానులకే అంకితం చేస్తున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించారు. . ఈ అవార్డును నా అభిమానులందరికీ అంకితం చేస్తున్నాను. మీ మద్దతు నన్ను ఎప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది అని అన్నారు.

రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2: ది రూల్" చిత్రంలోని ఆయన పాత్రకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందారు. ఇప్పటికే పుష్ప సినిమాకు జాతీయ అవార్డ్ సాధించిన బన్నీ.. గద్దర్ అవార్డ్ కూడా రావడంతో మరో మెట్టు ఎక్కినట్టు అయ్యింది. ఈ ఉత్సాహంతో పుష్ప3ని అంతకు మించి తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు టీమ్.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss కు వెళ్ళడం వల్ల చాలా నష్టపోయాను, అవకాశాలు కోల్పోయాను, టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Varun Sandesh: అందుకే మాకు పిల్లలు పుట్టలేదు, వచ్చే ఏడాది గుడ్ న్యూస్ చెబుతామంటున్న హీరో