పగలంతా షూటింగ్, రాత్రంతా డబ్బింగ్, పట్టుదలతో పని పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Published : May 29, 2025, 05:34 PM ISTUpdated : May 29, 2025, 07:57 PM IST
Pawan Kalyan completes dubbing for Hari Hara Veera Mallu

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు డిప్యూటీ సీఎంగా ఎంత బిజీగా ఉన్నా.. తనను నమ్ముకున్న నిర్మాతలకోసం పెండింగ్ సినిమాలను కంప్లీట్ చేయడానికి ముందుకు వచ్చాడు. రాత్రీ పగలు కష్టపడుతూ.. సినిమాను పట్టుదలతో కంప్లీట్ చేస్తున్నాడు పవర్ స్టార్.

జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలతో పాటు తన సినిమా ప్రాజెక్టులపై పూర్తి దృష్టి పెట్టారు. పెండింగ్ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు పవన్. పగలు షూటింగ్ చేస్తూ.. రాత్రి డబ్బింగ్ చెపుతూ.. సినిమాలపట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. తాజాగా పవన్ హరిహర వీరమల్లు కోసం నాలుగు గంటల్లోనే డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విషయమై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ సాగుతోంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం OG చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. నిన్నటితో( 28 మే) OG షూటింగ్ పూర్తి చేసిన పవన్, అదే రాత్రి 10 గంటల సమయంలో హరిహర వీరమల్లు డబ్బింగ్ పనులను ప్రారంభించారు. కేవలం నాలుగు గంటల్లోనే పూర్తి సినిమా డైలాగ్‌లు డబ్బింగ్ చేసి.. అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమలో ఇది అరుదైన ఘటనగా చెప్పవచ్చు.

హరిహరవీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతుండగా. డబ్బింగ్ పనులను తాజాగా కంప్లీట్ చేశాడు పవన్ కళ్యాణ్. గతం నుంచి పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ పై క్లారిటీ రావడంతో.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. అంతే కాదు ఈ సినిమాపై అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చేస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు హరిహరవీరమల్లు టీమ్. ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈమూవీని కొంత భాగం వరకూ క్రిష్ డైరెక్ట్ చేయగా.. ఆతరువాత భాగం యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు.

సాధారణంగా హీరోలు పూర్తిస్థాయి సినిమాలో డబ్బింగ్ చెప్పేందుకు మూడు నుంచి నాలుగు రోజులు సమయం కేటాయిస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఒక్క రోజంతా డబ్బింగ్ కోసమే వెచ్చిస్తారు. అలాంటి తరుణంలో, OG షూట్ ముగిశాక వెంటనే హరిహర వీరమల్లు కోసం పవన్ నాలుగు గంటల వ్యవధిలోనే పూర్తి డబ్బింగ్ చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రభుత్వ పాలన వ్యవహారాలతో బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ తన సినిమాల కోసం ఇలా టైమ్ కేటాయిస్తూ.. ఓవర్ టైమ్ పనిచేయడంతో ఆయన డెడికేషన్ కు ప్రశంసలు వస్తున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌