
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు లేరు. ఉన్నా.. స్టార్ డమ్ రాదు.. అయినా సరే పోరాడి హీరోయిన్లు గా గుర్తింపు తెచ్చుకున్న తారల్లో కలర్స్ స్వాతి కూడా ఒకరు. ఈమె తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ హిట్ సినిమాలు చేసిన కలర్స్ స్వాతి ఆమధ్య పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళి పోయింది. అక్కడే సెటిల్ అయ్యి..నిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.
ఇక చాలా కాలం అలాగే గడిపేసిన ఈ మాజీ హీరోయిన్.. ఈ మధ్యనే మళ్లీ యాక్టింగ్ వైపు వస్తోంది. నటన వైపు దృష్టి పెట్టింది. తన రీ ఎంట్రీని డీసెంట్ గా ప్లాన్ చేసుకోవాలని చూస్తుంది. సోషల్ మీడియాను ఫాలో అవుతూ..ఇండస్ట్రీ విషయాలు ఎప్పటికప్పుుడు తెలుసుకుంటూనే ఉంది కలర్స్ స్వాతి. ఇక రీసెంట్ గా నవీన్ చంద్ర - ఐశ్వర్య లక్ష్మి ప్రధానమైన పాత్రలను పోషించిన అమ్ము సినిమా చూసిన స్వాతి.. ఈ సినిమాపై తనదైన రివ్యూ ఇచ్చింది.
అమ్ము సినిమాపై సోషల్ మీడియా వేదికగా స్పందించింది కలర్స్ స్వాతి. ఈ సినిమా చూశాను .. కథ .. డైలాగ్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కనెక్ట్ అయ్యాను. గతంలో నేను .. నవీన్ చంద్ర కలిసి నటించాము. త్రిపుర సినిమాలోకి భిన్నంగా ఈ సినిమాలో ఆయన రోల్ ఉంది. నవీన్ మన ఇండస్ట్రీకి దొరికిన జెమ్ లాంటి వాడు. ఈ సినిమాలో ఆయన పోషించిన శాడిస్ట్ పాత్రను చూసి షాక్ అయ్యాను అని అన్నారు.
ఇక ఈ సినిమా ఇంటర్వెల్ లో ఆయన వచ్చి నాతో మాట్లాడబోయాడు. కాని నేను చాలా సీరియస్ గా చెప్పాను నాతో మాట్లాడకు .. ఇక్కడి నుంచి వెళ్లిపో' అని అన్నాను అని స్వాతిఅన్నారు. నవీన్ చంద్ర ఏదైనా పాత్ర చేస్తే.. అంతలా ఇన్ వాల్వ్ అయ్యి చేస్తారంటూ కితాబిచ్చింది స్వాతి. అతే కాదు నవీన్ చంద్రతో ప్రస్తుతం మంన్త్ ఆఫ్ మధు' అనే సినిమాను అని అన్నారు స్వాతి.
నవీన్ కు హీరోగా మంచి లైఫ్ ఉంది.. కాని ఆయన హీరోగా మాత్రమే కాదు.. డిఫరెంట్ రోల్స్ చేస్తూ వెళుతున్నాడు. అలాంటి పాత్రలే చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాని తనకి ఎలాంటి పాత్రను ఇచ్చినా చాలా సిన్సియర్ గా చేస్తాడు. అలాగే ఈ సినిమాలో ఆయన అద్భుతంగా చేశాడు .. తను దిష్టి తీయించుకోవాలి అంటూ కలర్స్ స్వాతీ తన అభిప్రాయం వెల్లడించింది.