Sukumar: టాలీవుడ్ లో సుకుమార్ రికార్డ్, రాజమౌళి తరువాత ప్లేస్ లో లెక్కల మాస్టారు

By Mahesh JujjuriFirst Published Nov 26, 2023, 10:41 AM IST
Highlights

టాలీవుడ్ లో స్టార్ హీరోలు, హీరోయిన్ల రెమ్యూనరేషన్ల గురించి వార్తలు వైరల్ అవ్వడం చూస్తుంటాం.. కాని దర్శకుడు రెమ్యూనరేషన్ల గురించి పెద్దగా డిస్కర్షన్స్ వచ్చిన సంరద్భాలు లేవు. తాజాగా సుకుమార్ వల్ల ప్రస్తుతం దర్శకులు రెమ్యూనరేషన్స్ న్యూస్ వైరల్ అవుతోంది. 
 

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్  సుకుమార్ రెమ్యూనరేషన్ ఎంతో ..? పుష్ప సినిమాతో ఆయన రేంజ్ తో పాటు.. రెమ్యూనరేషన్ కూడా పెరిగిందా..?  పుష్పకు ముందు ఎంత ఉంది..? పుష్ప తరువాత ఎంత ఉంది...? ప్రస్తుతం సినిమాకు ఆయన ఎంత డిమాండ్ చేస్తున్నాడు ఈ విషయాలు తెలిస్తేషాక్ అవుతారు. అవును..ఓ పాన్ ఇండియా హీరో రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం.. దర్శకులలో రాజమౌళికే సాధ్యం అయ్యింది. కాని ఇప్పుడు ఆ లిస్ట్ లో  సుకుమార్ కూడా చేరారట.  పుష్ప సినిమా వరకూ  25 కోట్లు తీసుకున్న సుక్కూ.. ఆతరువాత ఒక్కసారిగా నాలుగురెట్లు రెమ్యూనరేషన్ పెచినట్టు సమాచారం. 

ఎవరు అవునన్నా.. కాదన్నా రాజమౌళి తరువాత స్థానం ఇండస్ట్రీలో సుకుమార్ దే అంటున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకున్న దర్శకుడు ఎవరు అన్న ప్రశ్న ఎదురవుతే.. మరో సందేహం లేకుండా దర్శక ధీరుడు రాజమౌళి పేరు చెప్పవచ్చు. బాహుబలి నుంచి ఆయన రెమ్యూనరేషన్ భారీగా పెరిగింది. బహుబలి ట‌ైమ్ లోనే జక్కన్న దాదాపుగ 50 కోట్లకుపైగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని.. ఆతరువాత అవి ఇవి... లాభాలు శేర్లు ..ఇలా అన్నిలెక్క కట్టుకుంటే.. దాదాపు వంద కోట్ల వరకూ ఆయనకువర్కౌట్ అయినట్టు సమాచారం. ఇక ఆర్ఆర్ఆర్ కు రెమ్యూనరేషనే.. 100కోట్లు తీసుకున్నాడట రాజమౌళి. ఇక పైన లెక్కలు ఎన్ని వచ్చి ఉంటాయో చెప్పనక్కర్లేదు. 

Latest Videos

తెలుగులో ఆ తర్వాత ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నది సుకుమారే అని టాక్. పుష్ప 2 కోసం కొంత అమౌంట్, ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చే మొత్తంలో కొంత వాటా తీసుకునేలా సుకుమార్, నిర్మాతల మధ్య డీల్ జరిగిందట. ఇటీవల 'పుష్ప 2' డిజిటల్, శాటిలైట్ స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి విక్రయించారు. ఆ డీల్ తర్వాత సుకుమార్ రెమ్యూనరేషన్ లెక్కకడితే వంద కోట్లు దాటిందని టాక్.

ఇక పుష్ప2 సినిమాను  మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ బడ్జెట్ తో  నిర్మిస్తున్నారు. దీని కంటే ముందు సుకుమార్ దర్శకత్వంలో  పుష్ప : ది రైజ్' కాకుండా 'రంగస్థలం సినిమాలను నిర్మించారు. ఆ రెండు సినిమాలకు భారీగా లాభాలు వచ్చాయి. సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ... మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'ఉప్పెన 'కు కూడా వసూళ్లు బాగా వచ్చాయి. సుకుమార్ తో మైత్రీ మేకర్స్ వరుస సినిమాలు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 

click me!