Naresh : ఒకేసారి రెండు సత్కారాలు, అరుదైన గౌరవం పొందిన నటుడు నరేష్

Published : Nov 26, 2023, 08:50 AM ISTUpdated : Nov 26, 2023, 08:51 AM IST
 Naresh : ఒకేసారి రెండు సత్కారాలు, అరుదైన గౌరవం పొందిన నటుడు నరేష్

సారాంశం

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ అరుదైన రికార్డ్ సాధించారు. ఒకే సారి రెండు గౌరవాలు.. అది కూడా విదేశాల్లో సాధించారు. ఇంత వరకూ ఏ ఇండియన్ నటుడికి ఈ అరుదైన అవకాశం రాలేదు.   

టాలీవుడ్ సీనియర్‌ నటుడు వీకే నరేష్‌ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటైడ్‌ నేషన్స్‌లోని ముఖ్య విభాగం నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సెక్యూరిటీ అండ్‌ డిఫెన్స్‌ ప్లానింగ్‌ నుంచి గౌరవ డాక్టరేట్‌ను ఆయన అందుకున్నారు. శుక్రవారం ఫిలిప్పీన్స్‌లోని మనీలా క్యూజోన్‌ నగరంలో అట్టహాసంగా  జరిగిన ఈ  కార్యక్రమంలో  నరేష్ ను  సర్‌  బిరుదుతో సత్కరించడంతో పాటు గౌరవ డాక్టరేట్‌ను అందించారు. ఆర్బిట్రేషన్ అండ్ శాంతి కోసం జరిగే విషయాలలో మధ్యవర్తిత్వానికి సహచరుడిగా నరేష్ కు ఈ గౌరవాన్నిఅందించినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఫౌరహక్కుల సంరక్షకుడిగా నరేష్ ను గుర్తించారు. 

ఇక ఈ వేడుకలకు  నేషనల్‌ ఆకాడమీ ఆఫ్‌ సెక్యూరిటీ అండ్‌ డిఫెన్స్‌ ప్లానింగ్‌ జనరల్‌ దివాకర్‌ చంద్ర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా  నరేష్‌ తన స్పీచ్ తో ఆకకట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో వివిధ దేశాల ప్రభుత్వాలు, ఐక్యరాజ్య సమితి గొప్పగా కృషి చేస్తున్నాయి. మీడియా కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నది. సినీరంగంలో యాభై ఏండ్లు పూర్తి చేసుకున్న ఈ తరుణంలో అంతర్జాతీయ సంస్థ నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

 

ఇక టాలీవుడ్ సీనియర్ నటుడిగా నరేష్ ను ప్రత్యేకంగా  పరిచయం చేయాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తెలుగు సినీ పరిశ్రమలో  తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు నరేష్.  తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు నటుడు నరేష్. హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకూ.. ఆయన చేయని పాత్ర లేదు. ఇక రీసెంట్ గా  సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తిచేసుకుని గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నారు నరేష్. 

తాజాగా ఆయన కీర్తి పతాకంలో డాక్టరేట్ కూడా వచ్చిచేరింది. అయితే తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో వివాదాలు ఫేస్ చేశాడు నరేష్. ముగ్గరు భార్యలతో విడాకులు తీసుకునిసంచలనం అయ్యారు. అదంతా ఒక భాగం అయితే.. తన సహనటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తూ.. ఆమెను త్వరలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ ఇష్యూ చాలా కాలంగా తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?
ర‌జినీకి త‌ల్లిగా, ల‌వ‌ర్‌గా, భార్య‌గా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా